ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే.. భారీ పార్శిల్

26 Mar, 2021 15:19 IST|Sakshi

ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే..‘ఐఫోన్‌ టేబుల్‌’ వచ్చింది

షాకైన వినియోగదారుడు

బ్యాంకాక్‌: వ్యాపారాల్లోకి ఈ-కామర్స్‌ రంగ ప్రవేశంతో వస్తువుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.  వినియోగదారులు ఈ కామర్స్‌పైనే ఆధారపడి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అమ్మకాలు ఎంత గణనీయంగా పెరిగాయో అంతే సంఖ్యలో ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరిగాయి. ఒక వస్తువు తక్కువ ధర వస్తూంటే ముందు వెనుకా ఆలోచించకుండా వెంటనే ఆర్డర్‌ చేసి మోసపోయే సంఘటనలు కూడా పెరిగాయి.  వినియోగదారులు అత్యాశ, నిర్లక్ష్యం ఈ ఇలాంటి మోసాలకు పెట్టుబడి. తాజాగా ఇలాంటి ఉదంతమే ఒకటి థాయిలాండ్‌లో వెలుగులోకి  వచ్చింది. 

ముఖ్యంగా విలాసానికి మారు పేరైన ఐఫోన్‌అంటే మరీ మోజు ఎక్కువ.  ఈ ఉత్సాహంతోనే  మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకు ఐఫోన్‌న వస్తోందని ఒక పిల్లాడు పప్పులో కాలువేశాడు. థాయ్‌లాండ్‌కు చెందిన టీనేజర్‌ తక్కువ ధరకే ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ఆశపడ్డాడు.  వెంటనే ఆర్డర్ చేశాడు. ఐఫోన్‌ ఎప్పుడొస్తుందా! అని కళ్లల్లో వత్తులు వేసుకొని, ఎదురుచూస్తూ ఉన్నాడు. చేసిన  ఆర్డర్‌ రానే  వచ్చింది.  సాధారణంగా అయితే స్మార్ట్‌ఫోన్ పార్శిల్  చిన్నగా ఉంటుంది. కానీ తనకొచ్చిన భారీ పార్శిల్  చూసి నిర్ఘాంతపోయాడు. పార్శిల్ ఓపెన్ చేసిన అతగాడికి దిమ్మదిరిగా మైండ్‌ బ్లాక్‌ అయింది. విషయం ఏమిటంటే..ఐఫోన్ కు బదులు ఐఫోన్‌ ఆకారంలో  ఒక కాఫీ టేబుల్ వచ్చింది. తీరిగ్గా విషయాన్ని పరిశీలించాక జరిగిన మోసం అర్థం అయింది ఇ-కామర్స్‌ సంస్థ ప్రకటనలోని వివరాలన్నీ సరిగ్గా చూసుకోకుండా ఆర్డర్ చేసి మోస పోయానని గుర్తించాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అదీ సంగతి..ఫ్రీ, డిస్కౌంట్లు లాంటి ఆఫర్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. లేదంటే ఇలాంటి షాక్‌లు తప్పవు.  తస్మాత్‌ జాగ్రత్త! 

చదవండి: పోలీస్‌ అధికారి సాహసం..స్పైడర్‌మ్యాన్‌ అంటూ ప్రశంసలు

మరిన్ని వార్తలు