త్వరగా పెళ్లి చేసుకుంటే అక్కడ నగదు బాహుమతి..

29 Aug, 2023 11:01 IST|Sakshi

చైనాలో జననాల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతూ యుక్తవయస్సు వారు తగ్గిపోతున్నారు. యుక్త వయస్కులు పెళ్లికి దూరంగా ఉండటమే దీనికి కారణం అని గుర్తించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లికూతురు వయస్సు 25 ఏళ్లు, అంతకంటే తక్కువగా ఉంటే రూ.11,340 నగదును కానుకగా ఇవ్వనుంది. ఈ మేరకు హాంకాంగ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రోత్సాహంతోనైనా యువత త్వరగా పెళ్లి చేసుకుని జననాల సంఖ్యను పెంచుతారని ప్రభుత్వం భావిస్తోంది.

సరైన వయస్సులో చేసుకునే మొదటి పెళ్లికి మాత్రమే ఈ కానుక వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. చైనాలో గత ఆరు దశాబ్దాలుగా జనాభా రేటు ఘణనీయంగా తగ్గిపోతోంది. వృద్దుల సంఖ్య పెరుగుదలతో ఆందోళన చెందుతున్న అధికారులు.. జననాల సంఖ్యను పెంచడానికి అనేక చర్యలను తీసుకుంటున్నారు. 

చైనాలో సాధారణంగా పెళ్లికి కనీస వయ్సస్సు అబ్బాయికి 22, అమ్మాయికి 20గా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ పెళ్లి చేసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఆర్థికపరమైన చిక్కులతో పాటు ఒంటరి మహిళలు పిల్లలను కనే చట్టాలను ప్రభుత్వం కఠినతరం చేయడంతో జననాల సంఖ్య తగ్గిపోయింది.

2022లో వివాహాల సంఖ్య 68 లక్షలు కాగా.. 1986 తర్వాత ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమం. 2021 కంటే 2022లో 8 లక్షల వివాహాలు తక్కువగా అయ్యాయి. జననాల రేటులో ప్రపంచంలోనే అతి తక్కువ స్థానానికి చైనా చేరుకుంది. 2022లో రికార్డ్ స్థాయిలో 1.09గా నమోదు కావడం గమనార్హం. పిల్లల సంరక్షణకు అధిక ఖర్చు కావడం వల్ల చాలా మంది తల్లులు ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు. అదీగాక మహిళల పట్ల వివక్ష కూడా ఇందుకు శాపంగా మారింది.  

ఇదీ చదవండి: 3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి

మరిన్ని వార్తలు