China: కరోనాపై చైనా కీలక నిర్ణయం.. వాళ్లకు బిగ్ రిలీఫ్..

27 Dec, 2022 09:54 IST|Sakshi

బీజింగ్: కరోనా నిబంధనలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిన ‍అవసరం లేదని సోమవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. జనవరి 8 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో మూడేళ్ల తర్వాత విదేశీ ప్రయాణికులకు విముక్తి లభించింది.

ఇకపై చైనాకు వెళ్లేవారు కరోనా నెగిటివ్ ద్రువపత్రం చూపిస్తే సరిపోతుంది. 48 గంటలకు ముందు ఈ పరీక్ష చేయించుకుని ఉండాలి. అలాగే కరోనా  బాధితులతో సన్నిహితంగా మెలిగిన విదేశీయులను ట్రాక్ చేయడాన్ని కూడా చైనా నిలిపివేస్తోంది. సరకు దిగుమతికి ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

కరోనా వెలుగు చూసిన కొత్తలో విదేశీ ప్రయాణికులు కచ్చితంగా 14 రోజులు ప్రభుత్వ కారంటైన్ కేంద్రంలో ఉండాలని చైనా రూల్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకు దీన్ని 21 రోజులకు పెంచింది. అయితే కేసులు తగ్గాక ఐదు రోజులకు తగ్గించింది.

కోవిడ్ జీరో పాలసీ పేరుతో దాదాపు మూడేళ్లుగా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది డ్రాగన్ దేశం. అయితే ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ మొదటి వారంలో ఆంక్షలు సడలించింది. కానీ ఆ తర్వాత కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి.
చదవండి: పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్..

మరిన్ని వార్తలు