భారత్‌కు సౌదీ నుంచి 80 టన్నుల ఆక్సిజన్‌

26 Apr, 2021 09:13 IST|Sakshi

దుబాయ్‌: తీవ్ర ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొంటున్న భారత్‌కు సౌదీ అరేబియా 80 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను పంపుతోంది. అదానీ గ్రూపు, ఆక్సిజన్‌ ఉత్పత్తిదారు లిండే కంపెనీ సహకారంతో 80 టన్నుల ఆక్సిజన్‌ను  పంపుతున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘రియాద్‌లో భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు. ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్‌ను భారత్‌కు తరలించే  మిషన్‌లో నిమగ్నమయ్యాం. 80 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌తో  4 క్రయోజనిక్‌ ట్యాంకులు నౌకలో దమ్మామ్‌ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరాయి’ అని అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు