విమానాల లీజింగ్‌ వ్యాపారంలోకి అదానీ పోర్ట్స్‌

25 Oct, 2023 07:37 IST|Sakshi

ముంబై: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీ సెజ్‌) తాజాగా విమానాల లీజింగ్‌ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం సొంతంగా ఉడాన్‌వత్‌ లీజింగ్‌ ఐఎఫ్‌ఎస్‌సీ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసింది.

రూ. 2.5 కోట్లు అదీకృత మూలధనంతో దీన్ని ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా కూడా ఇటీవలే ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ సెంటర్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ) గిఫ్ట్‌ సిటీలో సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌ లీజింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. మరో విమానయాన సంస్థ ఇండిగో కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు