యుద్ధంలో దైవదూతలు ఉండరు.. రష్యా స్పేస్‌ చీఫ్‌కు ఎలన్‌ మస్క్‌ కౌంటర్‌

9 May, 2022 20:10 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఎలన్‌ మస్క్‌కు.. రష్యాకు మధ్య కోల్డ్‌ వార్‌ మరింత ముదిరింది. తాజాగా రష్యా స్పేస్‌ చీఫ్‌ దిమిత్రి రోగోజిన్‌కు కాస్త గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు మస్క్‌.

ఉక్రెయిన్‌ పరిణామాల్లో ఫాసిస్ట్‌ బలగాలకు మిలిటరీ కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌ ద్వారా ఎలన్‌ మస్క్‌ మద్ధతు ఇస్తున్నాడంటూ రష్యా స్పేస్‌ చీఫ్‌ దిమిత్రి రోగోజిన్‌ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాదు.. మూర్ఖుడంటూ మస్క్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను మస్క్‌ సీరియస్‌గానే తీసుకున్నాడు. మీడియాకు రోగోజిన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ తాలుకా స్క్రీన్‌ షాట్‌లను ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేషన్‌ చేసి మరీ ఎలన్‌ మస్క్‌ తన ట్విటర్‌ వాల్‌పై పోస్ట్‌ చేసి మరీ కౌంటర్‌ ఎటాక్‌ మొదలుపెట్టాడు. 

తాజాగా.. యుద్ధంలో దైవదూతలంటూ ఎవరూ ఉండరని రోగోజిన్‌కు పంచ్‌ వేశాడు. అంతకు ముందు చావు గురించి ఎలన్‌ మస్క్‌ చేసిన ఓ ట్వీట్‌ మీద విపరీతమైన చర్చ నడిచింది. అనుమానాస్పద రీతిలో చనిపోతే.. అంటూ రష్యా నుంచి తనకు ముప్పు ఉందన్న కోణంలో ట్వీట్‌ చేశాడు. 

ఇదిలా ఉంటే.. రష్యా దురాక్రమణ మొదలైన తొలి నాటి నుంచే ఉక్రెయిన్‌కు మద్ధతు ప్రకటించాడు ఎలన్‌ మస్క్‌. అంతేకాదు తన శాటిలైట్‌ సర్వీస్‌ కంపెనీ స్టార్‌లింక్‌ నుంచి సేవలు సైతం అందించాడు. ఒకానొక టైంలో తనతో బాహాబాహీకి తలపడాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కే సవాల్‌ విసిరాడు ఎలన్‌ మస్క్‌.

చదవండి: ‘ఒక వేళ నేను చనిపోతే?’.. ఎలన్‌ మస్క్‌ సంచలన ట్వీట్

మరిన్ని వార్తలు