ట్విటర్‌ యూజర్లకు భారీ షాక్‌, ఎలన్‌ మస్క్‌ టార్గెట్‌ వేలకోట్లు!

9 May, 2022 20:12 IST|Sakshi

ట్విటర్‌ బాస్‌ ఎలన్‌ మస్క్‌ యూజర్లకు భారీ షాకివ్వనున్నారు. ట్విటర్‌లో ఇకపై సబ్‌ స్క్రిప్షన్‌ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇప్పటికే పలు నివేదికలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసందే. తాజాగా అందుకు ఊతం ఇచ్చేలా మరో రిపోర్ట్‌ సోషల్‌ మీడియాలో చక‍్కర్లు కొడుతోంది.   


ఎలన్‌ మస్క్‌ 44బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఫ్రీడం ఆఫ్‌ స్పీచ్‌ పేరుతో ఈ మైక్రో బ్లాగింగ్‌ను కొనుగోలు చేసినా..ఆ సంస్థ ద్వారా మస్క్‌ భారీ ఆదాయాన్ని గడించే ప్రయత్నాల్లో ఉన్నట్లు టైమ్స్‌ రిపోర్ట్‌ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ట్విటర్‌ను వినియోగిస్తున్న బ్లూ టిక్‌ వెరిఫైడ్‌ అకౌంట్‌ యూజర్ల నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు టైమ్స్‌ రిపోర్ట్‌ తన నివేదికలో పేర్కొంది. తద్వారా 2028 నాటికి మస్క్‌ వెయ్యికోట్లు వసూలు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ప్రస్తావించింది. 


భవిష్యత్‌లో ట్విటర్‌ ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుందనే విషయాల్ని పెట్టుబడి దారులకు ఎలన్‌ మస్క్‌ చెప్పినట్లు టైమ్స్ నివేదిక వివరించింది. 2025 నాటికి ట్విటర్‌ బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌లను 69 మిలియన్ల మొత్తాన్ని వసూలు చేయడం.. ఆ సబ్‌ స్క్రిప్షన్‌ ద్వారా కొత్త ఫీచర్లను అందించి 2028 నాటికి 128 మిలియన్ల మంది యూజర్లు చేరుకునేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. 

నెలకు రూ.269
గతేడాది ట్విటర్‌ సంస్థ బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌పై నెలవారి సబ్‌స్క్రిప్షన్‌ కింద రూ.269 వసూలు చేస్తుంది. ఈ సబ్‌స్క‍్రిప్షన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు ట్వీట్‌లను అన్‌డూ చేయడం, ట్వీట్‌లను సేకరించి ఫోల్డర్‌ను క్రియేట్‌ చేయడం, ట్విటర్ ఐకాన్‌ కలర్స్‌ మార్చడం వంటి ప్రత్యేక ఫీచర్లను వినియోగించుకునే సదుపాయం ఉంది. ఈ నేపథ్యంలో 2025 నాటికి ట్విటర్‌ యూజర్ బేస్ దాదాపు 3రెట్లు పెరిగి 2025 నాటికి ట్విటర్ యూజర్లు 600మిలియన్లకు చేరుకుంటారని, 2028 నాటికి ఆ సంఖ్య దాదాపు 931 మిలియన్లకు చేరుతుందని మస్క్‌ భావిస్తున్నాడు.  

కాగా, మస్క్‌ త్వరలో యూజర్లకు సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొని రానుండగా..ఆ సబ్‌ స్క్రిప్షన్‌ ఎవరికి వర్తిస్తుందనే అంశం వెలుగులోకి రాలేదు. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్‌తో అందించే అదనపు ఫీచర్ల వల్ల ట్విటర్‌ 2023 నాటికి 9మిలియన్ల యూజర్లను, 2028 నాటికి 104 మిలియన్ మంది యూజర్లు చేరుతారని ఎలన్‌ మస్క్‌ ఇన్వెస్టర్లతో చర్చించినట్లు పలు పత్రికా కథనాలు చెబుతున్నాయి.

చదవండి👉ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు..సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ భార్య అదిరిపోయే ట్విస్ట్!

మరిన్ని వార్తలు