టైమ్‌ స్క్వేర్‌‌పై రాముడి చిత్రాలు.. నిజమేనా?

5 Aug, 2020 21:30 IST|Sakshi

నూయార్క్‌ : అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల కల. ఆ అపురూప ఘట్టానికి బుధవారం (ఆగస్టు 5) అంకురార్పణ పడింది.ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి  భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఉత్సవాన్ని పురస్కరించుకుని  న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌‌లో బిల్‌బోర్డ్స్‌ మీద రామాలయం, రాముడి ఫొటోలు, రామనామం, శంకుస్థాపన జరుగుతున్న వీడియోలను 3డీ పోర్ట్‌రైట్స్‌లో డిస్‌ప్లే చేసినట్లు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే ఆ ఫోటోలు ఫేక్‌ అని తేలింది.

అసలు చిత్రం

అసలు టైమ్‌ స్క్వేర్‌‌లో బిల్‌బోర్డ్స్‌ మీద రాముడు ఫోటోలు డిస్‌ప్లే చేయలేదని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటోలు నకిలీవని, డిజిటల్‌ మీడియా ద్వారా మార్ఫింగ్‌ చేశారని తేల్చిచెప్పారు. అసలు ఫోటోలు ఎలా ఉన్నాయో కూడా చూపించారు. దీంతో టైమ్స్‌స్క్వేర్‌ బిల్‌బోర్డ్స్‌ మీద డిస్‌ప్లే అయిన  రాముడు ఫోటోలు ఫేక్‌ అని తేలిపోయింది.

మరిన్ని వార్తలు