3.30 నిమిషాల్లో పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు దావా..

29 Nov, 2022 08:11 IST|Sakshi

వాషింగ్టన్‌: ‘రెండు నిమిషాల్లో రెడీ.. 3 నిమిషాల్లో రెడీ..’ అని ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ప్యాకెట్స్‌పై వివరాలు ఇస్తుంటాయి కంపెనీలు. వాటిని ఉడికించబోతే చెప్పిన సమయం కంటే ఎక్కువే తీసుకుంటాయి. అది మామూలేలే.. అని మనం పట్టించుకోం. కానీ.. ఫ్లోరిడాకు చెందిన ఈ మహిళ ఊరుకోలేదు. చెప్పిన టైమ్‌లో పాస్తా ఉడకలేదని ఫుడ్‌ కంపెనీపై రూ.40కోట్లు దావా వేసింది.

ఫ్లోరిడాకు చెందిన అమాండా రెమీరేజ్‌... క్రాఫ్ట్‌ హీంజ్‌ కంపెనీకి చెందిన వెల్వెటా షెల్స్‌ పాస్తా అండ్‌ ఛీజ్‌ను కొనుగోలు చేసింది. దాన్ని మైక్రోవేవ్‌లో ఉడికిస్తే.. మూడున్నర నిమిషాల్లో రెడీ అయిపోతుందని ప్యాక్‌పై రాసి ఉంది. కానీ అందులో వివరించినట్టుగా మూడున్నర నిమిషాల్లో పాస్తా అండ్‌ ఛీజ్‌ ఉడకలేదని, ప్యాక్‌పై ఉన్న వివరాలు వినియోగదారులను పక్కదారి పట్టించే విధంగా ఉందని అమాండా ఆరోపించింది. పరిహారం కింద రూ.40 కోట్లు, జరిగిన నష్టానికి రూ.80 లక్షలు చెల్లించాలని కోర్టులో కేసు వేసింది.
చదవండి: మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం.. అది గ్రహాంతరవాసిదా!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు