57 అడుగుల విగ్రహం.. 35 కేజీల మాస్క్‌

17 Jun, 2021 15:00 IST|Sakshi

జపాన్‌లో జరిగిన సంఘటన

టోక్యో: కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి మాస్క్‌ తప్పనిసరి అయ్యింది. మాస్క్‌ ధరించకుండా బయటకు వెళ్తే జరిమానా విధిస్తున్నారు. మాస్క్‌ లేకపోతే ఎక్కడికి అనుమతించడం లేదు. మనుషులకు మాస్క్‌ సరే కానీ దేవుడి విగ్రహాలకు కూడా మాస్క్‌ పెట్టడం కొంత విడ్డూరంగా ఉంటుంది. అయితే అది కూడా చిన్నచితకా మాస్క్‌ కాదండోయే.. ఏకంగా 35 కేజీల భారీ మాస్క్‌ దేవతా విగ్రహానికి పెట్టారు. ఈ సంఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. 

జపాన్‌లో 57 మీటర్లు ఎత్తున్న బౌద్ధ మాత విగ్రహానికి భారీ మాస్క్‌ ధరింపజేశారు. 57 మీటర్ల ఎత్తు విగ్రహానికి 5.3 మీటర్ల పొడవు, 4.1 మీటర్ల వెడల్పు కలిగిన ‘35 కిలోలు’ బరువు ఉన్న మాస్కును బౌద్ధ మాతకు ధరింపజేశారు. అనంతరం కరోనా మహమ్మారి నుంచి తమను కాపాడాల్సిందిగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు జపాన్‌లోని కుషిమా ప్రిఫెక్చర్‌ ప్రాంతం వాసులు. 

57 మీటర్ల ఎత్తున్న బౌద్ధ మాత విగ్రహాన్ని 33 సంవత్సరాల క్రితం నిర్మించారు. బోలుగా ఉండే ఈ విగ్రహం భుజం వరకు వలయాకారంలో మెట్లను ఏర్పాటు చేశారు. చిన్న బిడ్డను ఎత్తుకున్నట్లు ఉండే ఈ విగ్రహం వద్ద జనాలు తమ పిల్లలను కాపాడమని.. సుఖప్రసవాలు అయ్యేలా చూడమని వేడుకుంటారు. జపాన్ అంటేనే భూకంపాలకు నిలయంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈక్రమంలో గత ఫిబ్రవరిలో సంభవించిన భూకంపానికి బౌద్ధ మాత విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. దీంతో విగ్రాహానికి మరమ్మత్తులు చేసిన అనంతరం ఈ భారీ మాస్కును తయారుచేసి బౌద్ధ మాతకు ధరింపజేసి..కరోనా నుంచి మా బిడ్డలను కాపాడు తల్లీ అంటూ ప్రార్థనలు చేశారు.

చదవండి: వైరల్‌: మాస్క్‌ పెట్టుకున్నాడు.. మొహం వింతగా మారిపోయిందే!

మరిన్ని వార్తలు