నగదు బదిలీ అద్భుతం: ఐఎంఎఫ్‌

14 Oct, 2022 05:34 IST|Sakshi

వాషింగ్టన్‌: కేంద్రం చేపట్టిన ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు నిజంగా అద్భుతమంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కొనియాడింది. అంతటి సువిశాల దేశంలో ఇంత భారీ పథకాలను అత్యంత కచ్చితత్వంతో అమలు చేయడం అద్భుతమేనని ఐఎంఎఫ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పావులో మారో అన్నారు. ‘‘ఈ విషయంలో భారత్‌ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

సంక్టిష్ట సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వాడుకుంటూ ప్రపంచానికి భారత్‌ స్ఫూర్తిదాయకంగా నిలిచింది’’ అని బుధవారం ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ పథకాల్లో చాలావరకు మహిళలకు సంబంధించినవే. మరికొన్ని వృద్ధులకు, రైతులకు ఉద్దేశించిన పథకాలూ ఉన్నాయి. వీటి సమర్థ అమలుకు ఆధార్‌ను చక్కగా వినియోగించుకోవడం అభినందనీయం’’ అన్నారు. కేంద్రం 2013 నుంచి ఇప్పటిదాకా రూ.24.8 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసింది.

మరిన్ని వార్తలు