అఫ్గాన్‌కు తక్షణ మానవతా సాయం

20 Dec, 2021 06:17 IST|Sakshi

న్యూఢిల్లీ: అఫ్గాన్‌ ప్రజలకు తక్షణ మానవతాసాయం అందించాలని భారత్, ఐదు సెంట్రల్‌ ఆసియా దేశాలు నిర్ణయించాయి. అదేసమయంలో, అఫ్గాన్‌ గడ్డ ఉగ్రవాదులకు శిక్షణ, సాయం, ఆశ్రయాలకు అడ్డాగా మారనివ్వరా దని ఆదివారం న్యూఢిల్లీలోని జరిగిన మూడో భారత్‌–సెంట్రల్‌ ఆసియా సదస్సు పేర్కొంది. సదస్సులో భారత్‌ విదేశాంగ మంత్రి జై శంకర్‌తోపాటు కజఖ్‌స్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, తుర్కెమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ విదేశాంగ మం త్రులు పాల్గొన్నారు. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించి, అక్కడి ప్రజలకు తక్షణ సాయం అందజేయడం కొనసాగించాలని తీర్మానించారు. ప్రాంతీయ అనుసంధానతకు చేపట్టే ప్రాజెక్టులు పారదర్శకతతో, విస్తృత భాగస్వామ్యం, స్థానిక ప్రాధాన్యతలు, ఆర్థి కస్థిరత్వం ప్రాతిపదికగా ఆయా దేశాల సార్వభౌమత్వానికి భంగం కలుగని రీతిలో ఉం డాలని అనంతరం వారు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సెంట్రల్‌ ఆసియా దేశాలతో సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్‌ కట్టుబడి ఉందని మంత్రి                     జై శంకర్‌ చెప్పారు.   

మరిన్ని వార్తలు