Suella Braverman: యూకే హోం సెక్రటరీగా భారత సంతతి మహిళ

7 Sep, 2022 10:04 IST|Sakshi

లండన్‌: భారత సంతతికి చెందిన  సుయెల్లా బ్రేవర్మన్‌ యూకే కొత్త హొం సెక్రటరీగా భాద్యతలు చేపట్టారు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి. అంతేకాదు ఆమె తల్లి హిందూ తమిళియన్‌ ఉమా, తండ్రి గోవాకు చెందిన క్రిస్టీ ఫెర్నాండెజ్‌. ఐతే ఆమె తల్లి మారిషస్‌ నుంచి యూకే వలస వెళ్లగా, తండ్రి 1960లలో కెన్యా నుంచి వలస వచ్చారు. ప్రస్తుతం బ్రేవర్మన్‌కి చట్టపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న రువాండాకు చెందిన కొంతమంది శరణార్థులను పంపించాలనే ప్రభుత్వ ప్రణాళికకు సంబంధించిన ప్రాజెక్టులను  అప్పగించనున్నట్లు సమాచారం. ఆమె తనతోటి సహోద్యోగి భారత సంతతికి చెందిన ప్రీతీ పటేల్‌ వారుసురాలిగా ఈ అత్యున్నతి పదవిని చేపట్టారు. 

ఈ మేరకు బ్రేవర్మన్‌ మాట్లాడుతూ...బ్రెక్సిట్‌ అవకాశాలను పొదుపరిచి,  సమస్యలను చక్కదిద్దాలనుకుంటున్నాని చెప్పారు. యూరోపియన్‌ కోర్టు ఆఫ్‌ హ్యుమన్‌ రైట్స్‌ నుంచి యూకేని బయటకు తీసుకువచ్చేలా ఐరోపా నుంచి స్పష్టమైన విరామాన్ని కోరకుంటున్నాని తెలిపారు. ఆమె తన నాయకత్వ ప్రచార వీడియోలో తన తల్లిదండ్రుల గురించి చెబుతూ..వారు బ్రిటన్‌ని ప్రేమిస్తారని, తమకు ఈ దేశం అత్యంత భద్రతనిచ్చిందని అన్నారు.

తాను రాజకీయాల్లోకి రావడం వల్లే తన నేపథ్యం గురించి అదరికి తెలిసిందని చెప్పుకొచ్చారు. ఆమె 2018లో రేల్ బ్రేవర్‌మాన్‌ను వివాహం చేసుకుంది. ఆమె గతేడాది రెండోవ బిడ్డకు జన్మనిచ్చే నిమిత్తం ప్రసూతి సెలవుల్లో ఉన్న సయంలోనే క్యాబినేట్‌ మంత్రిగా అనుమతించేలా ఒక చట్టపరమైన మార్పును తీసుకువచ్చి పేరుగాంచారు. ఆమె బౌద్ధ మతస్తురాలు, పార్లమెంటులో కూడా బుద్ధుని సూక్తులకు సంబంధించిన ధ్మపద గ్రంథంపై ప్రమాణ స్వీకారం చేశారు.

(చదవండి: 'తక్షణమే రంగంలోకి దిగుతా'... వర్షంలో తడుస్తూనే)

మరిన్ని వార్తలు