18 ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్‌లోనే.. అక్కడే తుదిశ్వాస

14 Nov, 2022 06:07 IST|Sakshi

ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడు స్టీఫెన్‌ స్పీల్‌బర్గ్‌ ‘ది టర్మినల్‌’ హిట్‌ సినిమాకు స్ఫూర్తి అయిన ఇతని పేరు మెహ్రాన్‌ కరిమి నసీరి. ఇరాన్‌లోని మస్జీద్‌ సులేమాన్‌ సిటీలో పుట్టాడు. బ్రిటన్‌లో స్థిరపడాలనుకున్నాడు. అందుకు బ్రిటన్‌ నిరాకరించింది. బ్రిటన్‌లో భాగమైన స్కాట్లాండ్‌ తన తల్లి స్వస్థలం గనుక తనకు బ్రిటన్‌లో నివసించే హక్కుందని వాదించినా లాభంలేకపోయింది.

ఆ సమయానికి పారిస్‌లోని చార్లెస్‌ డిగాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మెహ్రాన్‌ అక్కడే ఆగిపోయాడు. ఇక దాన్నే తన స్థిరనివాసంగా మార్చుకున్నాడు. ఏకంగా 18 ఏళ్లు అక్కడే గడిపాడు! అనారోగ్యంతో కొన్నేళ్లు బయటికెళ్లినా ఇటీవల మళ్లీ తిరిగొచ్చి ఎయిర్‌పోర్ట్‌లోనే నివసిస్తున్నాడు. శనివారం తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు. అలా... ఎన్నో ఏళ్లుగా గడపిన విమానాశ్రయంలోనే శాశ్వత విశ్రాంతి తీసుకున్నాడు!!

మరిన్ని వార్తలు