పొరపాటున ముగ్గురు బందీలను చంపిన ఇజ్రాయెల్ సైన్యం

16 Dec, 2023 09:06 IST|Sakshi

టెల్ అవీవ్: హమాస్‌ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు చేస్తోంది. ఇదే వరసలో ఉగ్రవాదులుగా భావించి హమాస్ చెరలో బందీలుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్‌) కాల్చి చంపింది. షజయాలో జరుగుతున్న దాడుల్లో పొరపాటున ముగ్గురు బందీలపై కాల్పులు జరిపగా.. వారు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైనికాధికారులు తెలిపారు. 

ఈ ఘటనపై తాము కూడా విచారం వ్యక్తం చేస్తున్నట్లు సైన్యం పేర్కొంది. మరోమారు ఈ తప్పిదం జరగకుండా జాగ్రత్త పడతామని తెలిపింది. ప్రాణాలు కోల్పోయినవారిలో ఒకరు ఇజ్రాయెల్‌లోని కెఫర్ అజా ప్రాంతం వ్యక్తిగా గుర్తించగా.. మరో వ్యక్తి యోటమ్ హైమ్ ప్రాంతవారని పేర్కొన్నారు. మూడో వ్యక్తి వివరాలను బాధితుని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు గోప్యంగా ఉంచింది.

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. నాటి నుంచి యుద్ధం భీకరంగా నడుస్తోంది. ఇరువైపుల నుంచి భారీ స్థాయిలో నష్టం జరిగింది. హమాస్‌ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది.  ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1200 మంది బలయ్యారు. అటు.. హమాస్ వైపు 18,700 మంది ప్రాణాలు కోల్పోయారు.  

ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. రెండు మెట్రో రైళ్లు ఢీ

>
మరిన్ని వార్తలు