జెరూస‌లెంలో తిరిగి తెరుచుకున్న మౌంట్ హోలీ టెంపుల్

23 May, 2021 20:12 IST|Sakshi

జెరూస‌లేం: ఇజ్రాయెల్ రాజ‌ధాని జెరూసలేం తూర్పు భాగంలో ఉన్న టెంపుల్ మౌంట్ ఓపెన్ అయింది. ఇజ్రాయెల్ పోలీసు పర్యవేక్షణలో నేడు 50 మంది యూదు సందర్శకులు టెంపుల్ మౌంట్ ను సందర్శించారు. ఇజ్రాయెల్- గాజాను పాలిస్తున్న హమాస్ సంస్థ మధ్య కాల్పుల విరమణ జరిగిన మూడు రోజుల తర్వాత మొదటి సారిగా వారు టెంపుల్ మౌంట్ దగ్గరికి వెళ్లారు. మొదటి రోజున ఎలాంటి అవాంత‌రాలు లేకుండా ప్ర‌శాంతంగా యాత్ర కొన‌సాగింద‌ని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు.

ఇజ్రాయెల్-పాలస్తీనా సంస్థ మధ్య జరిగిన 11 రోజుల యుద్ధం త‌ర్వాత గాజా స్ట్రిప్‌లో ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. పరిస్థితి సాధారణ స్థితికి రావడం ప్రారంభమైంది. అంతకుముందు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కాల్పుల విరమణను పూర్తిగా పాటించాలని ఇరు ప్రాంతాలకు పిలుపునిచ్చింది. భద్రతా మండలిలోని మొత్తం 15 మంది సభ్యులు శనివారం ఒక ప్రకటనలో ‘హింస కారణంగా ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం ప్ర‌క‌టించారు. అలాగే, పాలస్తీనా పౌర జనాభాకు, ముఖ్యంగా గాజాలో మానవీయ సహాయం అవసరం అని ఐరాస నొక్కి చెప్పింది. మే 10న గాజా స్ట్రిప్‌ను పాలిస్తున్న హమాస్ మొదటి సారి దాడి చేయడంతో ఇజ్రాయెల్ రక్షణ చర్యలలో భాగంగా దాడులకు దిగింది. ఈ దాడుల్లో గాజాలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది. ఇజ్రాయెల్ లో ఎక్కువ ప్రాణ ఐరన్ డోమ్ అనే క్షిపణి నిరోదక వ్యవస్థ రక్షించింది.

చదవండి:
రెండు రాజ్యాల ఏర్పాటే ఏకైక పరిష్కారం: జో బైడెన్‌

మరిన్ని వార్తలు