మీరు ఆ ప్రాంతాన్ని తక్షణమే వీడండి.: ఇజ్రాయెల్‌ మరోసారి హెచ్చరికలు

22 Oct, 2023 15:49 IST|Sakshi

జెరూసలేం:  ఉత్తర గాజాపై మరోసారి భూతల దాడికి ఇజ్రాయెల్‌ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఉత్తర గాజా, దక్షిణ గాజాలపై వైమానికి దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌.. దాన్ని మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమైంది. ఉత్తర గాజాలో ఉన్న వాళ్లంతా తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లాల్సిందేనని హెచ్చరించింది ఇజ్రాయెల్‌, .

ఒకవేళ ఎవరైనా ఉత్తర గాజాను వీడి దక్షిణ గాజాకు వెళ్లకుంటే వారిని ఉగ్రవాదులుగానే పరిగణిస్తామని సంకేతాలు పంపింది ఇజ్రాయెల్‌. హమాస్‌ను అంతంమొందించాలనే లక్ష్యంతో ఉన్న ఇజ్రాయెల్‌..  వారికి స్థావరంగా ఉన్న ఉత్తర గాజాపై ఫోకస్‌ పెట్టింది. ఒకవైపు దక్షిణా గాజాపై కూడా దాడులు చేస్తూనే, ఉత్తర గాజాను వీడి దక్షిణ గాజాకు వెళ్లాలని ఇజ్రాయెల్‌ సూచించడానికి కారణాలు మాత్రం అంతుపట్టడంలేదు. 

కొన్ని రోజుల క్రితం ఉత్తర గాజాను ఖాళీ చేసి తక్షణం దక్షిణాదికి వెళ్లాల్సిందిగా 11 లక్షల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ హెచ్చరించిన తర్వాత అతి ప్రమాదకరమైన 20 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి వారంతా దక్షిణ గాజాకు చేరుకున్నారు. ఇంతా చేసినా రోజుల వ్యవధిలోనే దక్షిణ గాజాపైనా ఇజ్రాయెల్‌ తీవ్ర దాడులకు తెగబడడటంతో పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.  మళ్లీ ఇప్పుడు ఉత్తర గాజాలో ఎవరైనా ఉన్నట్లైతే వెంటనే దక్షిణ గాజాకు  తక్షణమే వెళ్లాలని వార్నింగ్‌ ఇచ్చింది. 

చదవండి:  ఇద్దరు అమెరికన్లను విడుదల చేసిన హమాస్‌.. త్వరలోని మరికొంతమంది!

‘క్లిక్‌ చేసి వాట్సాప్‌ ఛానెల్‌ ఫాలో అవ్వండి

మరిన్ని వార్తలు