కరోనా: జాన్సన్‌ సింగిల్‌ షాట్‌కు యూకే ఓకే 

29 May, 2021 06:52 IST|Sakshi

లండన్‌: ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్‌ వ్యాక్సిన్లన్నీ రెండు డోసులవి కాగా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు చెందిన సింగిల్‌ డోస్‌ టీకాకు యూకే ఆమోదం తెలిపింది. యూకేలో ఆమోదం పొందిన నాలుగో వ్యాక్సిన్‌ ఇదే కావడం గమనార్హం. రెండు కోట్ల కోవిడ్‌ వ్యాక్సిన్లను బ్రిటన్‌ ఆర్డర్‌ చేసింది. రాబోయే రోజుల్లో సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ముఖ్యమైన పాత్ర పోషించబోతోందని యూకే హెల్త్‌ అండ్‌ సోషల్‌ కేర్‌ విభాగం తెలిపింది.

భారత్‌లో కొత్త వేరియంట్‌ బయట పడిన నేపథ్యంలో యూకే లో యువత వ్యాక్సినేషన్ల కోసం పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని తెలిపింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా 72శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని అమెరికా ట్రయల్స్‌లో వెల్లడైంది. ప్రస్తుతం యూకేలో దాదాపు సగం జనాభాకు ఏదో ఒక వ్యాక్సిన్‌ కనీసం ఒక డోస్‌ అయినా పూర్తి అయింది. మిగతా వాక్సిన్లతో పోలిస్తే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోసు టీకా ఆలస్యంగానే అనుమతులు పొందింది.
చదవండి: రక్షణ భాగస్వామ్యం పెంచుదాం

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు