Cat Food : ఫుడ్‌ కంటైనర్‌లో స్పై కెమెరా!

2 Jan, 2022 16:45 IST|Sakshi

మనం ఏదైన మాల్స్‌కి వెళ్లితే అక్కడ పెద్ద పెద్ద షోరూంల వాళ్లు భద్రత దృష్ట్యా స్పైకెమరాలు, సీసీ కెమరాలు వంటివి ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కవ జనసందోహం ఉంటుంది. పైగా అక్కడ ఉ‍న్న ఖరీదైన వస్తువుల చోరికి గురికాకుండా ఉండే నిమిత్తం ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఒక కస్టమర్‌ తన పెంపుడు పిల్లులు కోసం కొనుగోలు చేసిన ఫుడ్‌ కంటైనర్‌లో ఉన్న స్పై కెమెరాను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.  

(చదవండి: ఫుల్‌గా తాగి సెక్యూరిటీ గార్డ్‌తో గొడవపడిన మహిళ)

అసలు  విషయంలోకెళ్లితే..ఒక వ‍్యక్తి లిల్లిపుట్, గోలియత్ అనే రెండు పెంపుడు పిల్లులు ఉంటాయి. సదరు వ్యక్తి తన పిల్లులకు సంబంధించిన ఆహారాన్ని స్థానిక కో-ఆపరేటివ్ ఫ్రాంచైజీ వెల్‌కమ్ స్టోర్‌లో కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒకరోజు అతను తన భార్యను ఆ ఆహార ప్యాకెట్లను తీసుకురమ్మని చెబుతాడు. దీంతో ఆమె ఆ ప్యాకెట్‌ని తీసుకుని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ ఫుడ్‌ ప్యాకెట్‌పై ఉన్న పిల్లి బొమ్మ తల మీద ఒక స్పై కెమెరా ఉంటుంది.

దీంతో ఆమె ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. అయితే అతను కూడా ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. బహుశా సెక్యూరిటీ నిమిత్తం ఇలా షాపు వాళ్లు ఇలా ఏర్పాటు చేశారేమో పొరపాటున మనకు వచ్చేసిందేమో అని అనుకుంటారు. ఆ తర్వాత ఇంతవరకు ఆ కెమెరాలో ఏమైన రికార్డు అయ్యిఉందేమో అని సీసీఫుటేజ్‌ నిమిత్తం తనిఖీ చేసి చూడగా మరోసారి షాక్‌కి గురవుతాడు. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఆ స్పై కెమెరాలో బ్యాటరీలు లేవు అందువల్ల అది వేటిని రికార్డు చేయలేదు. ఇంతవరకు స్టోర్‌ అయి ఉన్న డేటా ఏమి లేదని ఇది చూడటానికి ఆశ్చర్యంగానూ వింతగానూ ఉందని సదరు వ్యక్తి స్థానిక మీడియాకి తెలిపాడు.

(చదవండి: రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి)

మరిన్ని వార్తలు