అలా నటిద్దామనుకున్నాడు.. కనీసం మంచం కూడా దిగ‌లేక పాట్లు!

23 Aug, 2021 19:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గ‌ర్భం దాల్చ‌డం, బిడ్డకు జన్మనివ్వడం కవితలు రాసినంత, పాటలు పాడుకున్నంత ఈజీకాదు. మ‌హిళ‌ల జీవితంలో అదొక ఉద్విగ్న‌ సంద‌ర్భమే అయినా, ఆ నవమోసాలు పడే అవస్తలు సవాళ్లు, ప్రసవ వేదన, తదనంతర బాధలు అన్నీఇన్నీ కావు. అందుకే ‘‘రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ’’ అంటూ ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల ‘లేబర్‌రూం’ అనే కవితలో వర్ణిస్తారు. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అయితే దీన్ని స్వయంగా అనుభవిద్దామనుకున్న​ ఒక యువకుడికి ఎదురైన చేదు అనుభవం ఇపుడు వైరల్‌గా మారింది. అంతేకాదు పలువురిని ఆలోచింప చేస్తోంది.

గ‌ర్భిణీలు ప‌డే మాన‌సిక, శారీర‌క కష్టాలను, స్వ‌త‌హాగా అనుభ‌వించాలనుకున్నాడు మెయిట్‌లాండ్ పాపుల‌ర్ టిక్‌టాక‌ర్‌ హాన్లీ. ప్రెగ్నెంట్‌ లేడీగా  కనిపించేలా పొట్ట‌పై భారీ వాట‌ర్ మిల‌న్‌ను, అలాగే ఛాతీ వద్ద కూడా రెండు చిన్న వాట‌ర్ మిల‌న్‌ల‌న అమ‌ర్చుకున్నాడు. అలా మొత్తం నిండు గర్భిణీలా తన అవతారాన్ని మార్చుకున్నాడు. ఇక్కడవరకు బాగానే ఉంది. కానీ ఆ తరువాతే అబ్బాయిగారికి అసలు కష్టాలు మొదలయ్యాయి. వేషం అయితే వేసుకున్నాడు కానీ, అంత బరువుతో లేచి తిర‌గ‌డం మాత్రం అతని వల్ల కాలేదు. క‌నీసం మంచం మీద నుంచి కాలు కిందపెట్టలేకపోయాడు. నిజమైన గర్భధారణను అనుకరించడం అసాధ్యమైనప్పటికీ, ఒక ప్రయోగం చేయాలనుకున్నా... అదంత పెద్ద కష్టమేమీ కాదనుకున్నాను  కానీ మంచం నుండి లేవడానికి చాలా కష్టపడ్డానని హాన్లీ చెప్పాడు. ఈ ఘటనకు సంధించిన వీడియో  వైర‌ల్‌గా మారింది.  

చదవండి:  Afghanistan: తీవ్ర పరిణామాలు, అమెరికాకు తాలిబన్ల వార్నింగ్‌! 

‘తొమ్మిది నెలలు బిడ్డను మోయడం, జన‍్మనివ్వడం అషామాషీ కాదు.. ఫన్నీ అసలే కాదు. ఇదే వాస్తవం.. కావాలంటే  మీరూ  ట్రై చేయండి’ అంటూ కొంతమంది కమెంట్‌ చేస్తున్నారు. గర్భధారణ, ప్రసవం సవాళ్లను తేలిగ్గా కొట్టిపారేశే వాళ్లకి ఇదొక గుణపాఠం అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే ఈ వీడియో కోటి 70 ల‌క్ష‌లకు పైగా వ్యూస్‌ సాధించడం విశేషం. 

చదవండి: చర్చకు దారి తీసిన ఆనంద్‌ మహీంద్ర వైరల్‌ వీడియో

>
మరిన్ని వార్తలు