వైరల్ అవుతున్న మార్క్ జుకర్‌బర్గ్‌ తండ్రి కామెంట్స్!

25 Apr, 2021 20:47 IST|Sakshi

మనం ఎంత ఎదిగినా.. ఎల్లప్పుడూ మన తల్లిదండ్రులకు చిన్న పిల్లలుగానే అనిపిస్తాం. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌లో లైవ్ లోకి వచ్చి తాను ఒక ప్రాజెక్టు గురించి చాలా ఉత్సాహంగా భోజనం చేయకుండా పనిచేసినట్లు పేర్కొన్నాడు. ఎవరైనా ఇలా తిండి తినకుండా పని విషయంలో ఉత్సాహంగా పని చేశారా? అని    ఫేస్‌బుక్ ఒక ప్రశ్న అడిగాడు. చాలా సార్లు ఇలా జరుగుతునే ఉంటుంది అని, గత నెలలో నేను 10 పౌండ్లను కోల్పోయానని మరో పోస్టులో పేర్కొన్నారు. అయినప్పటికీ, అతను ఏ ప్రాజెక్టు గురుంచి చేస్తున్నాడో వెల్లడించలేదు. 

దీనికి స్పందించిన మార్క్ జుకర్‌బర్గ్‌ తండ్రి ఎడ్వర్డ్ జుకర్‌బర్గ్, ఇప్పుడు నీకు భోజనం అందించడానికి నేనూ, మీ అమ్మా అవసరమా అని కామెంట్ చేశారు. జుకర్‌బర్గ్‌ నువ్వు ఇద్దరు పిల్లలకు తండ్రి కావచ్చు, కానీ మాకు మాత్రం చిన్న పిల్లవాడివే. ఎవరూ వారి సొంత కొడుకు భాగోగులు గురించి చూసుకోవడం ఆగలేరు. మీరు మీ పనిపై దృష్టి సారించినపుడు మిమ్మల్ని మీరు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతె, మీకు మీ తల్లిదండ్రుల అవసరం కచ్చితంగా ఉంటుంది అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తండ్రి మాటలకు స్పందించిన మార్క్ జుకర్‌బర్గ్‌ “అయ్యో ధన్యవాదాలు, కానీ నేను తినడం మర్చిపోకుండా ఉండాలి” అని అన్నారు. ఇప్పుడు ఆ కామెంట్స్  సంబందించిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ అవుతున్నాయి. 

చదవండి: 

వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఫొటోలూ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు