చైనా దురాక్రమణ యత్నాలు తీవ్రతరం?

18 Sep, 2023 20:20 IST|Sakshi

తైపీ: పొరుగు దేశాల విషయంలో ఆధిపత్య ప్రదర్శన కోసం చైనా చేసే యత్నాల గురించి తెలియంది కాదు. ఈ క్రమంలో.. తైవాన్‌పై అది మిలిటరీ వేధింపులకు పాల్పడుతూ వస్తోంది. తాజాగా.. ఏకంగా వందకి పైగా యుద్ధవిమానాలను తైవాన్‌ వైపు పంపించి ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. 

చైనా చర్యలను కవ్వింపుగా అభివర్ణిస్తోంది తైవాన్‌ రక్షణశాఖ.. చైనా ఇప్పటివరకు పంపిన యుద్శ విమానాల్లో.. 40 యుద్ధవిమానాలు తైవాన్‌ జలసంధి(అనధికార సరిహద్దు రేఖ) మధ్య రేఖను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద దుందుడుకు చర్యగా తైవాన్‌ చెబుతోంది. యుద్ధవిమానాలతో పాటు తొమ్మిది చైనా నౌకలనూ గుర్తించినట్లు తెలిపింది.

మరోవైపు.. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. అక్కడ ‘మధ్య రేఖ’ అంటూ ఏదీ లేదని, తైవాన్ కూడా చైనాలో భాగమేనని పేర్కొనడం గమనార్హం. మరోవైపు తాజాగా తైవాన్‌ను  విలీనం చేసుకునేందుకు బీజింగ్‌ ఇటీవల ఓ ప్రణాళికను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ప్రణాళికను ఆవిష్కరించడం గమనార్హం. 

మరిన్ని వార్తలు