యుద్ధం ఆపేలా పుతిన్‌ని భారత ప్రధాని ఒప్పిస్తే సంతోషిస్తాం: ఉక్రెయిన్‌ మంత్రి

31 Mar, 2022 09:59 IST|Sakshi

Modi Need To Speak Directly Putin How To End The War: టర్కీలో శాంతి చర్చల్లో పురోగతి లభించిందని అంతా అనుకున్నారుగానీ అందుకు విరుద్ధంగా రష్యా వైఖరి ఉ‍న్నట్లు తెలుస్తోంది. ర​ష్యా బలగాలను ఉపసంహరించుకుంటానని హామి ఇచ్చి మరీ ఉక్రెయిన్‌ని బాంబులతో దద్దరిల్లేలా చేసింది. బుధవారం చెర్నిహివ్‌లో బలగాలు మైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. దీంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ కూడా రష్యా హామీని నిలబెట్టుకోకుండా అత్యంత దారుణంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఉక్రెయిన్‌ భారత్‌ రష్యాతో గల సంబంధాలను ఉపయోగించి ఈ యుద్ధం ఆపేలా చేస్తే ఉక్రెయిన్‌లో మరో వేల ప్రాణాలను బలవ్వవు అని భారత్‌కి మరోసారి హితబోధ చేసింది.

ఒక మీడియా సమావేశంలో ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ యుద్ధం ఆపేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తే గనుక తాము దాన్ని స్వాగతిస్తాం అని అన్నారు. రష్యాతో భారత్‌ కలిగి ఉన్న సంబంధాలను సద్వినియోగం చేసుకుని. పెద్దన్న పాత్ర పోషిస్తూ యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ని ఒప్పించాలని తాము అభ్యర్తిస్తున్నాం అని అన్నారు. రష్యాలో అన్ని నిర్ణయాలు తీసుకునే ఏకైక వ్యక్తి పుతిన్‌ కాబట్టి ఆయనతో మోదీ నేరుగా మాట్లాడి యుద్ధం ఆపేలా చేయాలని కోరుకుంటున్నాం అని చెప్పారు.

అయినా ఈ భూమ్మీద యద్ధం కావాలని కోరుకునే ఏకైక వ్యక్తి పుతిన్‌గా అభివర్ణించారు. రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్‌ని రక్షించుకునేందుకే తాము పోరాడుతున్నామని ఇది న్యాయబద్ధమైన పోరాటం అని అన్నారు. భారత్ ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాను అని కూడా అన్నారు. అంతేకాదు ఖార్కివ్‌లో రష్యా బాంబు దాడిలో మృతి చెందిన భారత విద్యార్థికి విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ఇస్తాంబుల్‌లో ఉక్రెయిన్‌ మరోసారి రష్యాతో చర్చలు జరిపింది. కానీ మాస్కో చర్చల పురోగతిపై ఆశలు నీరుగారుస్తోందన్నారు.

(చదవండి: యుద్ధంలో.. పుతిన్‌ను తప్పుదోవ పట్టిస్తోందెవరు?)

>
మరిన్ని వార్తలు