సూపర్‌ మార్కెట్‌లోకి అనుకోని అతిథి.. జనం హడల్‌

7 Apr, 2021 19:24 IST|Sakshi

బ్యాంకాక్‌: సాధారణంగా మనం సూపర్‌ మార్కెట్‌కి వెళ్లినప్పుడు అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. అక్కడ ఏ బల్లో, పురుగో కనిపిస్తే భయపడి అక్కడి నుంచి పారిపోతుంటాం. అయితే ఎక్కడ నుంచి ప్రత్యక్షమయ్యిందో కానీ ఒక పెద్ద మానిటర్‌ బల్లి స్టోర్‌ లోపలికి వచ్చేసింది. దీన్ని చూసిన కస్టమర్‌లు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ ఘటన థాయిలాండ్‌లో చోటుచేసుకుంది.

అక్కడి సూపర్‌ మార్కెట్‌‌లో ఒక పెద్ద మానిటర్‌ బల్లి ప్రవేశించింది. ఇంతటితో ఆగకుండా.. స్టోర్‌లోని షేల్ఫ్‌లో అటు ఇటు తిరుగుతూ అక్కడి వస్తువులను కింద పడేసింది. కాసేపు అక్కడ గందర గోళ వాతావరణం ఏర్పడింది. అందరు  భయంతో అరు‍స్తూ అ‍క్కడి నుంచి దూరంగా పారిపోయారు. ఆండ్రూ మాక్‌గ్రెగర్‌ అనే జర్నలిస్ట్‌ ట్వీటర్‌ వేదికగా  ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది.  దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో..ఎంత  భయంకరంగా ఉంది.. మీరేనా షాపింగ్‌ చేసేది.. పాపం దానిక్కుడా చేయాలనిపించిందేమో..అని ఫన్నీగా కామెంట్‌లు పెడుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు