అమెరికా, భారత్‌ బంధాలకు హద్దుల్లేవ్‌

2 Oct, 2023 05:53 IST|Sakshi

అమెరికాలో ప్రవాస భారతీయుల సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌

వాషింగ్టన్‌: అమెరికా, భారత్‌ మధ్య ద్వైపాక్షిక బంధాలకు హద్దుల్లేవని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరుకు న్నాయని, ఇరు దేశాలు పరస్పర అవసరాలు తీర్చుకుంటూ, సౌకర్యవంతమైన, అనుకూలమైన భాగస్వామ్యులుగా మెలగుతున్నాయని పేర్కొన్నారు. చంద్రయాన్‌ మాదిరిగా ఇరు దేశాల మధ్య బంధాలు చంద్రుడిని తాకాయని, అంతకుమించి హద్దుల్లేకుండా సాగిపోతున్నాయని అభివర్ణించారు.

అమెరికాలో పర్యటిస్తున్న జైశంకర్‌ శనివారం ప్రవాస భారతీయులతో ఇండియా హౌస్‌లో సమావేశమయ్యారు. ఇక్కడ నిర్వహించిన సెలబ్రేటింగ్‌ కలర్స్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిఫ్‌ కార్యక్రమానికి అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు తరలివచ్చారు. ప్రవాస భారతీయులనుద్దేశించి జై శంకర్‌ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరో కొత్త స్థాయికి తీసుకువెళతామని  చెప్పారు.

ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినా ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా సాగుతున్నాయని, ఇక భవిష్యత్‌లో సరికొత్త రంగాల్లో అమెరికాతో కలిసి పని చేస్తామని వెల్లడించారు. భారత్‌లో నిర్వహించిన జీ–20 సదస్సుకి అమెరికా సహకారం అందించడం వల్లే విజయ వంతమైందని అన్నారు. ‘‘దేశాలు ఒకరితో ఒకరు వ్యాపారాలు చేస్తాయి. రాజకీ యాలు చేస్తాయి. మిలటరీ బంధాలు కలిగి ఉంటాయి. విన్యాసాలు నిర్వహిస్తాయి. సాంస్కృతిక బదలాయింపులు ఉంటాయి. అయి నప్పటికీ రెండు దేశాలు లోతైన మానవీయ సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడే ఆ బంధం సంపూర్ణమవుతుంది. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య అలాంటి సంబంధాలే ఉండాలి’’ అని జైశంకర్‌ వివరించారు.

మరిన్ని వార్తలు