వైట్‌హౌస్, పెంటగాన్, యుద్ధ నౌకలు... 

29 Nov, 2023 04:30 IST|Sakshi

ఫొటోలను తమ నిఘా ఉపగ్రహం తీసిందన్న ఉత్తరకొరియా 

సియోల్‌: అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్‌హౌస్, రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్, అమెరికా విమాన వాహక నౌకల స్పష్టమైన ఫొటోలను సోమవారం తమ నిఘా ఉపగ్రహం పంపించినట్లు ఉత్తరకొరియా ప్రకటించుకుంది. వీటిని తమ నేత కిమ్‌ జొంగ్‌ ఉన్‌ పరిశీలించారని తెలిపింది.

మల్లిగియోంగ్‌–1 అనే  నిఘా ఉపగ్రహం ప్రయోగాన్ని కిమ్‌ తిలకిస్తున్న ఫొటోలను గత మంగళవారం అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ విడుదల చేసింది. శాటిలైట్‌ విడుదల చేసిన చిత్రాల్లో అమెరికా నేవీ కేంద్రం, నౌకాశ్రయం, వర్జీనియాలోని వైమానిక కేంద్రం ఉన్నాయని తెలిపింది.  

మరిన్ని వార్తలు