నాకు ప్రాణహాని ఉంది: పాక్ ప్రధాని

2 Apr, 2022 10:14 IST|Sakshi

ఇస్లామాబాద్‌: తనకు ప్రాణహాని ఉందని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి తన వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉందని చెప్పారు. తాను భయపడనని, దేశ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మాటలన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్, రాజీనామా, ముందుగానే ఎన్నికలు జరపడం అనే మూడు ఆప్షన్లను దేశ మిలటరీ తన ముందుంచిందని ఆయన చెప్పారు. వీటిలో ముందుగానే ఎన్నికలకు వెళ్లడమనే ఆప్షన్‌నే తాను ఎంచుకున్నానన్నారు.

(చదవండి: రెండున్నర కోట్ల మంది దిగ్భందం.. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న దృశ్యాలు)

మరిన్ని వార్తలు