మహా సిగ్గరి కోసం అలుపెరగని ప్రయాణం.. చివరికి ఇలా ‘అద్భుతంగా’ చిక్కింది!

9 Nov, 2022 11:49 IST|Sakshi

అదో అరుదైన జీవి. మనిషి కంటపడకుండా తిరగడం దాని నైజం. అలాంటి జీవిని.. అంతే అద్భుతంగా కెమెరాలో బంధించింది ఓ ఫీమేల్‌ ఫొటోగ్రాఫర్‌. అదీ ఎముకలు కొరికే చలిలో.. ఎంతో కష్టపడి మరీ!. 

అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ కిట్టియా పాలోస్కి.. మంచు పర్వత శిఖరాన ఠీవిగా కూర్చున్న మంచు చిరుతను కెమెరాలో బంధించింది. నేపాల్‌ ఖుంబు గ్లేసియర్‌లో ఫాంటోమ్‌ అల్లేగా పిలువబడే చోట ఆమెకు ఈ దృశ్యం తారసపడింది. కాలినడకన దాదాపు.. 165 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆమె ఈ అద్భుతాన్ని బంధించారట!.

A post shared by Kittiya Pawlowski (@girlcreature)

ఈ ఫొటో మాత్రమే కాదు.. ఎవరెస్ట్‌ పర్వతం, పుమోరి పర్వతాల నీడన మంచు చిరుత పయనిస్తున్న ఫొటోలను ఎంతో సుందరంగా తీశారు పాలోస్కి. ఎప్పుడైతే అవి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయ్యాయో.. అప్పటి నుంచి అవి వైరల్‌ కావడం ప్రారంభించింది. యానిమల్‌ప్లానెట్‌తో పాటు కొన్ని ప్రభుత్వ సంస్థలు సైతం ఆమె ఫొటోల్ని వాడేస్తున్నాయి. 

పాంథెరా జాతికి చెందిన మంచు చిరుతకు.. ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటెయిన్స్‌గా పేరుంది. సిగ్గుపడే స్వభావం కారణంగా అది మనుషుల కంట పడదు.. పడినా దాడి చేసిన సందర్భాలు లేవు!. అయితే వేట, అక్రమ రవాణా కారణంగా వీటి జనాభా బాగా తగ్గిపోతూ వస్తోంది.  2040 నాటికి ఇవి అంతరించుకునే పరిస్థితికి చేరుకుంటాయనే ఆందోళన నెలకొంది.

ఇదీ చదవండి: ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కి వెళ్తే ఇలాగే ఉంటది! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు