Russia Invites Taliban For Talks: తాలిబన్లను చర్చలకు ఆహ్వానించిన రష్యా

7 Oct, 2021 19:18 IST|Sakshi

ఈ నెల 20 మాస్కోలో తాలిబన్లతో చర్చలు

మాస్కో: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకుని.. పాలన ఆరంభించిన తాలిబన్లను చర్చలకు ఆహ్వానించింది రష్యా. అక్టోబర్‌ 20న మాస్కోలో తాలిబన్లతో చర్చలు జరపనున్నట్లు అఫ్గనిస్తాన్‌ రష్యా ప్రతినిధి ఒకరు గురువారం వెల్లడించారు. ప్రతినిధి జమీర్‌ కాబులోవ్‌ మీడియాతో మాట్లాడుతూ..  ‘‘అక్టోబర్ 20 న రష్యా రాజధానిలో అఫ్గన్‌ అంశంపై చర్చించేందుకుగాను తాలిబాన్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించాము’’ అని ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌ఐఏ నోవోస్టి వార్తా సంస్థకు తెలిపారు

అయితే ఈ మాస్కో ఫార్మట్‌ చర్చలకు హాజరవుతున్న తాలిబన్‌ ప్రతినిధులు ఎవరనేదాని గురించి సమాచారం లేదు. తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆ దేశంలో తలెత్తిన మానవతా విపత్తును నివారించడానికి ఈ చర్చలు సాయం చేస్తాయని.. రష్యా ఈ విషయంలో అఫ్గన్‌కు సాయం చేస్తుందని కాబులోవ్‌ తెలిపారు. ప్రస్తుతం దీని గురించి చర్చిస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 
(చదవండి: అఫ్గాన్‌ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు?)

ఇటీవల సంవత్సరాలలో అఫ్గన్‌ ప్రభుత్వంతో శాంతికి మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తున్న వరుస చర్చల కోసం మాస్కో.. తాలిబాన్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చింది. అఫ్గన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఒక నెల ముందు అనగా జూలైలో కూడా తాలిబన్లు మాస్కోలో పర్యటించారు. అఫ్గనిస్తాన్‌లో తమ సైనికులను చంపడానికిగాను రష్యా తాలిబన్లకు బహుమతులను అందిస్తుందని అమెరికా ఆరోపించింది. అయితే మాస్కో వీటిని ఖండించింది.

చదవండి: ఐరాసలో మాకూ చోటివ్వండి: తాలిబన్లు

మరిన్ని వార్తలు