పాక్‌లో ఆహార పంపిణీలో మళ్లీ తొక్కిసలాట

1 Apr, 2023 04:29 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌లోని రేవు నగరం కరాచీలో మరో విషాదం చోటుచేసుకుంది. రంజాన్‌ మాసం సందర్భంగా శుక్రవారం ప్రజలకు ఆహార పదార్థాలు పంపిణీ చేస్తుండగా, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. భాధితుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు.

ఆహార పదార్థాల పంపిణీ జరుగతుండగా, కొందరు అక్కడే ఉన్న కరెంటు తీగపై కాలు వేశారని, దాంతో భయందోళనకు గురై ఒకరినొకరు తోసుకున్నారని, ఫలితంగా పక్కనే ఉన్న కాలువలో పలువురు పడిపోవడం, 11 మంది మరణించడం క్షణాల్లో జరిగిందని అధికారులు వెల్లడించారు. ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాన్ని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ గతవారం ప్రారంభించారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఇటీవలే గోధుమ పిండి పంపిణీలో తొక్కిసలాట జరిగి 11 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు