Steve Jobs death anniversary: ఆపిల్‌ సీఈఓ భావోద్వేగ లేఖ

6 Oct, 2021 16:25 IST|Sakshi

2011  అక్టోబర్ 5న స్టీవ్ జాబ్స్  కన్నుమూత

10వ  డెత్‌ యానివర్సరీ  సందర్భంగా  స్టీవ్‌కు ఆపిల్‌ ఘన నివాళి 

ఆపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ 10వ వర్ధంతి సందర్భంగా  ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ స్టీవ్‌ జాబ్స్‌ కృషిని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ప్రస్తుతం ఆపిల్‌ సాధించిన ఘన విజయాలను చూసేందుకు జాబ్స్‌ ఉండి ఉంటే బావుండేదని టిమ్‌ కుక్‌ అభిప్రాయపడ్డారు.  తన ట్విటర్‌లో స్టీవ్‌కు సంబందించిన ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. అభిరుచి ఉన్న వ్యక్తులు ప్రపంచాన్ని మంచిగా మార్చగలరు" అని స్టీవ్ నమ్మాడు. అపుడే దశాబ్దం గడిచిపోయిందంటే నమ్మలేకుండా ఉన్నాం. కానీ మీ ఉనికి ఎప్పటికీ సజీవమే ఆయనకు నివాళులర్పించారు.

ఆపిల్‌ తన హోమ్‌పేజీలో జాబ్స్‌కు నివాళుర్పించింది.. స్టీవ్ మరణించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టిమ్‌ కుక్‌ఉద్యోగులకు ఒక లేఖ రాశారు.. స్టీవ్‌ వదిలిపెట్టిన అసాధారణ వారసత్వాన్ని గుర్తు చేసుకొనేందుకు ఇదొక అపూర్వ సందర్భం అని కుక్‌ తెలిపారు. ఆయనొక మేధావి.ఎంతో దూరదృష్టి గలవాడు.  ప్రపంచం ఎలా ఉండబోతోందో చూడాలని సవాల్‌ చేసిన మనిషి.  వాస్తవానికి తాను  స్టీవ్‌  గురించి ఆలోచించని రోజు లేదని కుక్‌ పేర్కొన్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అద్భుతమైన వినూత్నమైన ఉత్పత్తులను తీసుకువచ్చాం. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యేలా ఇన్నోవేటివ్‌ ఉత్సత్తులపై దృష్టి సారించాం. ఇందుకు చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. విశ్వంలో కూడా తమంతట తాముగా సత్తా చాటేలా ప్రోత్సహించాం.  స్టీవ్ మనందరికీ ఇచ్చిన అనేక బహుమతులలో ఇదొకటి. (Steve jobs: ఫాదర్‌ ఆఫ్‌ ది డిజిటల్‌ రెవల్యూషన్‌ గుడ్‌ బై స్పీచ్‌ విన్నారా?)

ఈ క్రమంలో  మీ అద్భుతమైన పని తీరు, మీలో దిగి వున్న ఆయన స్ఫూర్తిని చూసేందుకు స్టీవ్  ఇక్కడ ఉండి వుంటే బావుండేదని ఉద్యోగులనుద్దేశించి టిమ్‌ కుక్‌ రాశారు.  కానీ అన్నింటికంటే ముఖ్యంగా భవిష్యత్తులో ఏమి సృష్టించబోతున్నారో చూడాలని భావిస్తున్నానన్నారు. తాను గర్వించదగ్గ విజయాలు ఇంకా చాలా రాబోతున్నాయని స్టీవ్  ముందే ఊహించారు. ఆయన ప్రతిరోజూ ఎవ్వరూ చూడని భవిష్యత్తును ఊహించుకుంటూ,తన ఆలోచనలకు జీవం పోసేలా నిర్విరామంగా కృషి చేశారంటూ టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు. ఎదగడం ఎలాగే నేర్పిన వ్యక్తి స్టీవ్‌. ఆయనకు ఆయనేసాటి. ఆయనను మిస్ అవుతున్నాను. కానీ ఎప్పటికే ఆయనే స్ఫూర్తి అంటూ టిమ్‌ కుక్‌ స్టీవ్‌కు  ఘన నివాళులర్పించారు.

కాగా కేన్సర్‌తో బాధపడుతూ ఆపిల్‌ సీఈఓ పదవినుంచి వైదొలిగిన రెండు నెలల తరువాత  2011,  అక్టోబర్‌ 5న  56 సంవత్సరాల వయస్సులో  స్టీవ్‌ జాబ్స్‌ కన్నుమూశారు. స్టీవ్‌ స్థానంలో టిమ్‌ కుక్‌ సీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. సుమారు 2026 వరకు  ఈ బాధ్యతల్లో టిమ్‌  కొనసాగనున్నారు. 

మరిన్ని వార్తలు