పాపం ప్రత్యర్ధి చేతిలో తనువు చాలించిన సుమో రెజ‍్లర్‌

1 May, 2021 17:04 IST|Sakshi

టోక్యో : ప్రత్యర్థి చేతిలో గాయపడి ఓ యువ సుమో రెజ్లర్‌ తనువు చాలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నెలరోజుల తర్వాత మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. భారీకాయంతో ప్రేక్షకుల్ని అలరించే పురాతన క్రీడ అయిన సుమో రెజ్లింగ్‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న హిబికిర్యూ (28) మార్చి 26న చివరి గ్రాండ్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌ జరిగే సమయంలో ప్రత్యర్ధి రెజ్లర్‌ హిబికిర్యూని బౌట్‌లో మట్టికరిపించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ప్రత్యర్ధి హిబికిర్యూని కిందపడేయడంతో తల బలంగా నేలకు తాకింది. దీంతో అస్వస్థతకు గురైన అతడు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు.

వాస్తవానికి గేమ్‌లో నిబంధనల మేర బౌట్‌లో కిందపడిన రెజ‍్లర్‌ పైకి లేసే సాంప్రదాయం ఉంది. అలాగే బౌట్‌లో నేలకొరిగిన హిబికిర్యూ కూడా లేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఎంతకీ పైకి లెగవలేకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన మ్యాచ్‌ ప్రతినిధులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సుమారు నెలరోజుల పాటు ట్రీట్మ్‌ంట్‌ తీసుకున్న రెజ్లర్‌ హిబికిర్యూ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో మరణించినట్లు జపాన్‌ సుమో అసోసియేషన్‌ ప్రకటించింది.

మరిన్ని వార్తలు