శిక్షణ విన్యాసాల్లో అపశ్రుతి.... హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మృతి

12 Sep, 2022 12:29 IST|Sakshi

కాబూల్‌: అప్గనిస్తాన్‌లో కాబూల్‌ శిక్షణా విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమెరికా తయారు చేసిన బ్లాక్‌హాక్‌ ఛాపర్‌ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒక అనుభవం లేని తాలిబన్‌ పైలెట్‌ ఆ అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన సంభవించింది. తాలిబన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగనట్లు ధృవీకరించింది.

ఈ ఛాపర్‌ని శిక్షణా విమానంగా పేర్కొంది. అయితే మంత్రిత్వశాఖ అదనంగా ఐదుగురు చనిపోయారని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి యునైటెడ్‌ స్టేట్స్‌ 2002  నుంచి 2017 మధ్య సుమారు రూ. 2 లక్షల కోట్లు విలువైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నైట్‌ విజన్‌ పరికరాలు, విమానాలు, నిఘా వ్యవస్థలతో సహా అఫ్గాన్‌ ప్రభుత్వానికి రక్షణాయుధాలను పంపింది.  

(చదవండి: ప్రపంచంలో అత్యంత వృద్ధ రైల్వే యూనియన్‌ నాయకుడిగా రికార్డు)
 

మరిన్ని వార్తలు