Twitter layoffs: ఉద్వాసన తప్ప దారి లేదు: మస్క్‌

6 Nov, 2022 05:57 IST|Sakshi

న్యూయార్క్‌: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సారథ్యంలో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. సంస్థను ప్రక్షాళన చేసే పనిలో మస్క్‌ నిమగ్నమయ్యారు. సంస్థకు రోజూ 4 మిలియన్‌ డాలర్ల (రూ.32.79 కోట్లు) నష్టం వస్తోందని మస్క్‌ శనివారం ట్వీట్‌ చేశారు. అందుకే ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవాలని నిర్ణయించామని తెలిపారు. రాజీనామా చేసేవారికి 3 నెలల ప్యాకేజీ ఇస్తున్నామని, పట్టప్రకారం ఇవ్వాల్సిన దానికంటే ఇది 50 శాతం ఎక్కువ అని చెప్పారు.

ట్విట్టర్‌ను మస్క్‌ గత నెలలో 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సంస్థలో నిత్యం వందలాది మందికి పింక్‌ స్లిప్పులు అందుతున్నాయి. భారత్‌లో 200 మందికి పైగా ఉద్యోగులను ట్విట్టర్‌ తొలగించింది. ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్‌ తదితర విభాగాల్లో లేఆఫ్‌లు అమలు చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో పలువురు ట్విట్టర్‌ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ట్విట్టర్‌ యజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘింస్తోందని, చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.  

మరిన్ని వార్తలు