పుతిన్‌ చెంపను నిమిరిన హిట్లర్‌! ఇదే వాస్తవం

24 Feb, 2022 21:33 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడి కొనసాగుతోంది. ఇప్పటికే 70 సైనిక స్థావరాలు, 10 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించుకుంది. 40 మంది ఉక్రెయిన్‌ సైనికులు, పది మంది పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చర్యలను ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన పుతిన్‌ పోకడలను సోషల్‌ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కామెంట్లు, మీమ్స్‌తో పుతిన్‌ను పెద్దఎత్తును ట్రోల్‌ చేస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ ప్రభుత్వ ట్విటర్‌ హ్యాండిల్‌ ఓ క్యారికేచర్‌ను పోస్ట్‌ చేసింది. పుతిన్‌ను జర్మనీ నియంత​ అడాల్ఫ్ హిట్లర్‌ ఆప్యాయంగా చెంపను నిమురుతున్న ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోను చూసిన పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తు‍న్నారు. ఓ నెటిజన్‌ క్యారికేచర్‌ను ఓ ‘పొలిటికల్‌ మీమ్‌’ అంటూ కామెంట్‌ చేయగా..‘అది మీమ్‌ కాదు.. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న వాస్తవాలకు ప్రతిరూపం’ అని పేర్కొంది ఉక్రెయిన్‌ ప్రభుత్వం. 

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు సమీపిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని నగరంలోని ఉత్తర భాగంలో రష్యా దళాలు ప్రవేశించాయి. ఇప్పటికే లుహాన్స్‌క్‌లోని రెండు పట్టణాలను రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు ప్రతిఘటన దాడుల్లో పది రష్యా ఫైటర​ జెట్లు ధ్వంసం అయినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు