ప్రెసిడెంటు గారు.. ఆయన పెట్స్‌

21 Jan, 2021 08:23 IST|Sakshi

వైట్‌హౌస్‌ అంటే అక్కడి ప్రెసిడెంటు గారిలాగే ఆయన పెంపుడు జంతువులు (పెట్స్‌) కూడా ఫేమసే.. ఎప్పుడో 1789లో అమెరికా మొదటి అధ్యక్షుడిగా పీఠాన్ని అధిరోహించిన జార్జ్‌ వాషింగ్టన్‌ నుంచి మొన్నమొన్నటి బరాక్‌ ఒబామా దాకా పెంపుడు జంతువులంటే పడి చచ్చేవారే.. ఒక్క మన ట్రంప్‌ మాత్రమే మినహాయింపు.. ఆయనకు పెంపుడు జంతువులు లేనేలేవు.. అమెరికా అధ్యక్షుల్లో అలా లేకపోవడం ఓ రికార్డు కూడా.. కనీసం కుక్కనైనా పెంచుకోమని సలహా ఇస్తే.. నాకంత టైం లేదని ట్రంప్‌ కొట్టిపారేశారు. బైడెన్‌ రాకతో వైట్‌హౌస్‌లో మళ్లీ ఇప్పుడు పెంపుడు జంతువులు ప్రవేశించనున్నాయి.  ఆయనకు రెండు కుక్కలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు పెంచుకునే వాటిల్లో కుక్కలు, పిల్లులు, గుర్రాలు, మేకలు, గొర్రెలు, రకరకాల పక్షులు.. అంతేనా.. ఎలుగుబంట్లు, మొసలి కూడా ఉన్నాయి. జార్జ్‌ వాషింగ్టన్‌ దగ్గర బోలెడన్ని గుర్రాలు ఉండేవి. వాటితోపాటు మొసలి కూడా ఉండేది. అది ఆయన బాత్రూంలోనే మకాం వేసేదట. విదేశాల నుంచి వచ్చిన అతిథులు సడెన్‌గా దాన్ని చూసి.. హడలి చచ్చిన రోజులున్నాయి. ఇక ఉడ్రో విల్సన్‌ గారి గొర్రెలు వైట్‌హౌస్‌ లాన్‌లోనే గడ్డిమేసిన ఉదంతాలెన్నో. ఇలా చెప్పుకుంటే బోలెడు కథలు. కొందరు అధ్యక్షులైతే.. . కొన్ని రకాల పక్షులు, గొర్రెల మందలను పెంచుకునేవారని.. అవి ఎన్ని వందలు ఉండేవో వాటి లెక్కే లేదని ప్రెసిడెన్షియల్‌ పెట్‌ మ్యూజియం గణాంకాలు చెబుతున్నాయి. వాటిని లెక్కేయకుండా.. ప్రధానమైన పెంపుడు జంతువుల లెక్కను మాత్రమే ఈ పెట్‌ మ్యూజియం నిర్వహిస్తోంది. దీని ప్రకారం అందరి కన్నా ఎక్కువగా.. థియేడర్‌ రూజ్‌వెల్ట్‌ వద్ద 48 పెంపుడు జంతువులు ఉండేవి. ఇందులో 6 కుక్కలు, 2 పిల్లులు, 40 ఇతర జంతువులు ఉన్నాయి. అందరి అధ్యక్షుల లిస్టు అంటే చదవడం కష్టం కానీ.. ఓసారి బైడెన్‌తో కలుసుకుని లాస్ట్‌ 10 మంది అధ్యక్షుల పెంపుడు జంతువుల జాబితా ఓసారి చూసేద్దామా..

మరిన్ని వార్తలు