రెండేళ్లుగా ఫ్రిజ్‌లోనే తల్లి శవం..కన్న కూతురికి కూడా తెలియకుండా..

4 Feb, 2023 15:14 IST|Sakshi

యూఎస్‌లో ఒక షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. తల్లి చనిపోయినా.. బయటకు పొక్కనీకుండా కూతురు అత్యంత రహస్యంగా ఉంచింది. దీంతో పోలీసులు ఆమె అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని చికాగోలో ఇల్లినాయిస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం..ఎవా బ్రాచర్‌ అనే 60 ఏళ్ల మహిళ తన 96 ఏళ్ల తల్లి రెజీనా మిచాల్స్కీ రెండేళ్ల క్రితమే చనిపోయింది. అయితే ఆ విషయం బయటకు పొక్కనీయకుండా అత్యంత జాగ్రత్తపడింది. ఆమె ఇల్లినాయిస్‌లోని రెండు అంతస్తుల అపార్ట్‌మెంట్‌ భవనం సెల్లార్‌లోని డీప్‌ ప్రీజ్‌లో ఆమె తల్లి మృతదేహాన్ని కనుగోన్నారు చికాగో పోలీసులు.

ఈ మేరకు పోలీసు కేసు నమోదు చేసి బ్రాచర్‌ని అదుపులో తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో ఆమె తల్లి పేరుతో తప్పుడు ఐడీని కలిగి ఉన్నట్లు కౌంటీ అసిస్టెంట్‌ స్టేట్‌ అటార్నీ మైఖేల్‌ పెకారా చెప్పారు. అంతేగాదు బ్రాచర్‌ తన తల్లి చనిపోవడానికి రెండు సంవత్సరాల క్రితమే డీప్‌ ఫ్రీజర్‌ని కోనుగోలు చేసినట్లు ఉన్న రసీదును కూడా ఆమె నివాసం వద్ద కనుగొన్నట్లు తెలిపారు. అసలు ఎందుకలా ఆమె తన తల్లి మరణం గురించి ఎవరికీ తెలియకుండా దాచి ఉంచిందన్న విషయంపై విచారించడం ప్రారంభించారు పోలీసులు.

ఒకవేళ తన తల్లి మరణం దాచడం ద్వారా ఎవా బ్రాచర్‌ పొందే సామాజిక భద్రతా ప్రయోజనం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బ్రాచర్‌ కూతురు సబ్రినా వాట్సన్‌ తన తల్లికి ఎవరీ పట్ల ప్రేమ ఉండదని, ఆఖిరికీ తనమీద కూడా ఉండదంటూ కన్నీటి పర్యతమయ్యింది. కనీసం ఆమెకు మానవత్వం కూడా లేదంటూ.. అమ్మమ్మ మిచాల్స్కీ తలుచుకుంటూ విలపించింది. 

(చదవండి: ఓరి దేవుడా! అది బస్సా! ఇంకేదైననా? ఆ స్థితిలో కూడా ఏం రేంజ్‌లో వెళ్తోంది)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు