వైర‌ల్‌: మందు కోసం పిల్లోడిని ప‌డేసింది

17 Oct, 2020 16:28 IST|Sakshi

ఉరుకుల ప‌రుగుల జీవితంలో త‌ల్లిదండ్రులెలాగో పిల్ల‌ల‌ను స‌రిగా ప‌ట్టించుకోవ‌డమే మానేస్తున్నారు. నాన‌మ్మ, అమ్మ‌మ్మ తాత‌య్య‌ల ద‌గ్గ‌ర వ‌దిలేసి వారి ప‌నుల‌ను చూసుకుంటున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండే వీరికి మ‌న‌వ‌ళ్ల‌తోనే బోలెడంత కాల‌క్షేపం. కానీ పైన ఫొటోలో క‌నిపిస్తున్న నాన‌మ్మ చేసిన ప‌నికి అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు. అంతలా త‌ప్పు ప‌ట్టేందుకు ఆమె ఏం చేసింద‌నుకుంటున్నారా.. అస‌లు సంగ‌తి తెలిస్తే మీరే అవాక్కవుతారు. సోఫాలో కూర్చున్న బామ్మ ప‌క్క‌న బుడ్డోడు నిల‌బ‌డ్డాడు. ఆమె ఎదుట‌ మందు గ్లాసు ఉంది. అది కంట‌ప‌డ‌టంతో పిల్ల‌వాడు దాన్ని అందుకోవాల‌ని ప్ర‌య‌త్నించి ప‌డేయ‌బోయాడు. అంతే.. ఆమె చ‌టుక్కున చంటోడిని వ‌దిలేసి గ్లాసు కింద‌ప‌డి ప‌గిలిపోకుండా కాపాడింది.(చ‌ద‌వండి: ‘ముంబై పవర్ ‌కట్‌’ టాప్‌లో ట్రెండింగ్‌)

కానీ చంటోడు మాత్రం నాన‌మ్మ త‌న‌ను వ‌దిలేయ‌డంతో ఢ‌మాలున కింద‌ప‌డ్డాడు. ఈ స‌న్నివేశానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టివర‌కు ఈ వీడియోను ఎనిమిది మిలియ‌న్ల మందికి పైగా వీక్షించారు. కొంద‌రు నెటిజ‌న్లు ఆమె చేసిన ప‌నిని మెచ్చుకుంటూ పెద్ద ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా కాపాడింద‌ని కొనియాడుతున్నారు. గ్లాసు కింద ప‌డుంటే పిల్ల‌వాడికి గాయాలయ్యే అవ‌కాశం ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రికొంద‌రేమో పిల్ల‌వాడి క‌న్నా మందుకే అంత ప్రాధాన్య‌త‌నివ్వ‌డ‌మేంట‌ని విమ‌ర్శిస్తున్నారు. ఆల్క‌హాల్ కోసం బుడ్డోడిని కింద‌ ప‌డేసిందంటున్నారు. (చ‌ద‌వండి: వైరల్‌: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు..)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా