‘ముఖానికి మాస్కు లేదా.. అయితే ఈ యంత్రం పెట్టేస్తుంది’

18 Aug, 2020 18:06 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు పాటించినా మాయదారి మహమ్మారి విజృంభణ పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం ఈ మూడు విషయాలు అత్యంత కీలకంగా మారిపోయాయి. ముఖ్యంగా మాస్క్‌లు. జేబులో రూపాయి లేకున్నా బయటకు వెళ్లవచ్చేమో కానీ ముఖానికి మాస్క్‌ లేకుండా మాత్రం అడుగు బయట పెట్టలేం. మాస్కుల్లో.. సర్జికల్‌, ఎన్‌ 95, కుట్టిన మాస్కులు, లేదా చేతి రుమాళ్ల వంటి వివిధ రకాల వాటిని వాడుతున్నారు

ఇటీవల బాస్కెట్‌ బాల్‌ మాజీ క్రీడాకారుడు రెక్స్‌ చాప్మన్‌ ప్రజలకు మాస్కులు పెట్టే యంత్రానికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోలో యంత్రం ముందు ఓ వ్యక్తి కూర్చొని ఉంటే కొన్ని సెకన్లకు యంత్రం దానంతట అదే మనిషి కూర్చున్న దిశగా ముఖానికి మాస్కును విసురుతుంది. ఈ మాస్కు వ్యక్తి ముఖానికి సరిగ్గా ఇముడుతుంది. ఈ యంత్రాన్ని అలెన్‌ పాన్‌ అనే వ్యక్తి తయారు చేశాడు. దీనికి ది కరేనేటర్‌ అని పేరు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. దీనిని ఇప్పటి వరకు దాదాపు పది లక్షల మంది దాకా వీక్షించగా అనేక మంది కామెంట్‌ చేస్తున్నారు. (మాస్కు.. మరిచితిరా!)

మరిన్ని వార్తలు