నిద్రపోతున్న ప్రియుడిపై ప్రియురాలి దారుణం

8 Apr, 2021 17:22 IST|Sakshi

తైపీ: తనతో సహజీవనం చేస్తున్న ప్రియుడు వేరే మహిళతో​ సంబంధంపెట్టుకోవడాన్ని ఆ మహిళ భరించలేకపోయింది. ప్రియుడికి ఎలాగైన బుద్ధి చెప్పాలనుకుంది. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడి అంగాన్ని కోసేసి తన కోపాన్ని తీర్చుకొంది. ఈ ఘటన తైవాన్‌లోని చాంఘువా కౌంటీలోని జిహుటౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది.  52 ఏళ్ల హువాంగ్‌ తన ప్రియురాలు పూంగ్‌తో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు.

అయితే పుంగ్‌కు తన ప్రియుడు మరో మహిళతో సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో అతను రోజులాగే తాగి నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే పుంగ్‌ వంట గదిలోకి వెళ్లి ఒక పదునైన కత్తి తీసుకొని వచ్చి ప్రియుడి అంగాన్ని కొసేసింది. మత్తులో ఉన్న అతనికి నొప్పి తెలియలేదు. ఆ తర్వాత ఆమె దాన్ని బాత్రూంలో పడేసి ఫ్లష్‌ చేసింది. ఉదయాన్నే నిద్రనుంచి లేచిన హువాంగ్‌ అంగం వద్ద నొప్పిగా ఉండటంతో చూశాడు. ఆ తర్వాత బెడ్‌షిట్‌ అంతా రక్తపు మరకలే ఉన్నాయి. వెంటనే భయపడిపోయాడు.

తన ప్రియురాలు కోసం అరిచాడు. ఆమె కనిపించలేదు. కాసేపు చుట్టుపక్కల తెగిపడిన అంగం కోసం వేతికాడు.. దొరకలేదు. వెంటనే ఆసుపత్రికి ఫోన్‌ చేశాడు. అంబులెన్స్‌ వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడికి  డాక్టర్లు అత్యవసర చికిత్సను అందించారు.  మూత్రం మార్గంలో ప్రత్యేకంగా సర్జరీ చేశారు.  ఆ వ్యక్తికి మొదట ఈ పని ఎవరు చేశారో తెలియలేదు.

అయితే, కొన్ని రోజులకు  ఈ పనిచేసింది తన ప్రియురాలే అని తెలిసి ఆశ్చర్యపోయాడు. ‘తాను మద్యం మత్తులో ఉన్నప్పుడు తనపై అనుమానంతోనే ప్రియురాలు ఈ పని  చేసిందని తెలుసుకొని షాక్‌కు గురయ్యాడు. ఆ ఘటన తర్వాత పుంగ్‌నేరుగా పోలీసులు దగ్గరికి వెళ్లి లొంగిపొయింది. తను తన ప్రియుడిపై అనుమానంతోనే ఈ పనిచేసినట్లు ఒప్పుకొంది. కేసు నమోదుచేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు