ఈ నెలలో ఇదే పెద్ద జోక్‌!

12 Nov, 2020 14:49 IST|Sakshi
వెడ్డింగ్‌ డ్రెస్‌తో డ్యూయెక్స్‌ ఓబ్రే

కొన్ని కొన్ని సార్లు డిగ్రీలు, పీజీల కంటే కామన్‌ సెన్స్‌ ఎంత అవసరమో ఈ స్టోరీని చదివితే తెలుస్తుంది. కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా ఎంత తెలివితక్కువగా వ్యవహరిస్తారో అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే.. డ్యూయెక్స్‌ ఓబ్రే అనే యువతికి నెల రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. పేరు మోసిన కంపెనీలో ఆర్డర్‌ చేసి పెళ్లి కోసం మంచి డ్రెస్‌ కూడా కుట్టించుకుంది. ఆ డ్రెస్‌ ఇంటికి రాగానే ఓ ట్రైల్‌ చూద్దామని దాన్ని వేసుకుంది. అయితే తాను ఆర్డర్‌ చేసిన విధంగా కాకుండా చిందరవందరగా అనిపించిందది‌. దీంతో ఓబ్రేకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సదరు కంపెనీకి డ్రెస్‌ సరిగా లేదంటూ గరంగరంగా మెయిల్‌ పెట్టింది. ( అరుదైన రికార్డు: భారీ మార్కర్‌ పెన్ను )

ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా పంపింది. దీనిపై సదరు కంపెనీనుంచి వచ్చిన సమాధానం చదివి ఓబ్రే సిగ్గుతో తలదించుకుంది. మరీ ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించానా అనుకుంది. ఆ కంపెనీ ఏం సమాధానం పంపిందంటే ‘‘మీరు డ్రెస్‌ను తిరగేసుకున్నారు. సరైన విధంగా వేసుకుని చూడండి’’ అని. దీని గురించి ఓబ్రే తన ఫేస్‌బుక్‌ ఖాతాలో రాసుకొచ్చింది. దీంతో ఈ వార్త కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘నువ్వు డ్రెస్‌ ఎలా వేసుకున్నా అందంగానే ఉన్నావు... అయ్యో! నవ్వలేక చచ్చిపోతున్నా... మమ్మల్ని కడుపుబ్బా నవ్వించినందుకు ధన్యవాదాలు... ఈ నెలలో ఇదే పెద్ద జోక్‌!’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ( వైరల్‌ వీడియో: ఏంటీ ‘పులి’తోనే ఆటలా?! )

మరిన్ని వార్తలు