మహిళలకు మాతృత్వం.. ఓ వరం | Sakshi
Sakshi News home page

మహిళలకు మాతృత్వం.. ఓ వరం

Published Sun, Nov 19 2023 1:30 AM

తుల్లలను సన్మానించిన డీఎంహెచ్‌వో లలితాదేవి
 - Sakshi

కరీంనగర్‌టౌన్‌: మాతృత్వం ఓ వరమని, ప్రతీ మహిళ తల్లయినప్పుడే సంపూర్ణ సీ్త్ర అవుతుందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి అన్నారు. శనివారం కరీంనగర్‌లోని ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సెంటర్‌లో ఐవీఎఫ్‌ ద్వారా తల్లయిన మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ కారణాల వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులతో 60 శాతం మంది బాధ పడుతున్నారని తెలిపారు. సమస్యకు ఆదిలోనే చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తరఫున ఆరోగ్య మహిళ క్లినిక్‌లో ఇలాంటి వారికి కౌన్సెలింగ్‌ చేస్తున్నామని తెలిపారు. ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ జిగ్నా తమగోండ్‌ మాట్లాడుతూ.. ఒయాసిస్‌లో అధునాతన సంతానోత్పత్తి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. సున్నా స్పెర్మ్‌ కౌంట్‌ ఉన్న పురుషులు పితృత్వాన్ని సాధించడానికి మైక్రోటీస్‌ (మైక్రోసర్జికల్‌ టెస్టిక్యులర్‌ స్పెర్మ్‌ ఎక్స్‌ట్రాక్షన్‌) వంటి అధునాతన పద్ధతుల్లో వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. మారుతున్న జీవనశైలి, నిద్రలేమి, ఊబకాయం, ఆలస్యమవుతున్న మాతృత్వం, పీసీవోఎస్‌ తదితర కారణాల వల్ల వంధ్యత్వం పెరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి

ఐవీఎఫ్‌ ద్వారా తల్లయిన మహిళలకు సన్మానం

Advertisement
Advertisement