Sakshi News home page

మూడోసారి విజేతగా నిలవాలి

Published Sun, Nov 19 2023 1:30 AM

- - Sakshi

గతంలో రెండుసార్లు వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచాం. ఇప్పుడు అందరి దృష్టి భారత్‌పైనే ఉంది. అద్భుత పోరాట పటిమ ప్రదర్శించి ఫైనల్‌లో అడుగుపెట్టాం. ఈసారి గెలిస్తే మూడుసార్లు విజేతగా నిలిచినట్టవుతుంది.

– గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి,

క్రికెట్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు)

సెమీ ఫైనల్‌లో అద్భుత విజయం

సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించాం. ఫైనల్‌ ప్రతి ఒక్కరూ ఆచితూచి ఆడాల్సిన సమయం. అప్పుడే విజయం అలవోకగా సాధిస్తాం. లీగ్‌లో అద్భుతంగా రాణించిన భారత్‌ వీరులు ఇలాగే ఆడితే చాంపియన్‌ మనమే.

– చల్ల హరిశంకర్‌,

రాష్ట్ర బేస్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు

ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

వరల్డ్‌ కప్‌లో వరుసగా పది విజయాలు నమోదు చేసి ఫైనల్‌ చేరామంటే మన జట్టు ఎంత మంచి ఫామ్‌లో ఉందో చెప్పక్కర్లేదు. జట్టు క్రీడాకారులందరూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎలాంటి పొరపాట్లు చేయకుంటే అలవోక విజయం సాధిస్తాం.

– కీర్తి రాజవీరు, జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి, కరీంనగర్‌

Advertisement

What’s your opinion

Advertisement