తెలంగాణను దగా చేసింది కాంగ్రెస్సే

24 Nov, 2023 01:32 IST|Sakshi
పాలకుర్తి: బీఆర్‌ఎస్‌లో చేరిన వారితో మంత్రి దయాకర్‌రావు

దేవరుప్పుల: ఆరు దశాబ్దాలపాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా దగా చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది.. మరోసారి ఆ పార్టీ వాగ్దానాలకు మోసపోవద్దని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని రామరాజుపల్లి, నీర్మాల, సింగరాజుపల్లి, చౌడూరు, మాధాపురం, పెద్దమడూరు, సీతారాంపురం గ్రామాల్లో ఎర్రబెల్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ చారిత్రాత్మక సంక్షేమ పథకాలు చేపట్టి దేశంలోనే అగ్రభాగాన నిలిచారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో రూ.730కోట్లతో అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కల్పించిన తాను.. ఆరుసార్లు చట్టసభల్లో నిలిచి తన జీవితం ప్రజాసేవకు అంకితం చేశానని అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ బస్వ సావిత్రిమల్లేషం, జెడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్‌ రాంరెడ్డి, వైస్‌ ఎంపీపీ విజయ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు దయాకర్‌, రవి, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామ్‌సింగ్‌, విక్రమ్‌రెడ్డి, దామెదర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరిక..

పాలకుర్తి: పలు గ్రామాల నుంచి కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గోపాలపురం కాంగ్రెస్‌ గ్రామ అధ్యక్షుడు కుసుమ సోమిరెడ్డి, పెద్ద రాంరెడ్డి చేరికలో ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం : ఎర్రబెల్లి ఉషాదేవి

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని మంత్రి దయాకర్‌రావు సతీమణి, ఎర్రబెల్లి ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ ఉషాదేవి అన్నారు. గురువారం పాలకుర్తిలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, సర్పంచ్‌ వీరమనేని యాకాంతరావు, మార్కెట్‌ చైర్మన్‌ ముస్కు రాంబా బు తదితరులు పాల్గొన్నారు.

సంఘాల మద్దతు..

తొర్రూరు రూరల్‌: ఎమ్మెల్యే అభ్యర్థి దయాకర్‌రావుకు తొర్రూరు మండలానికి చెందిన నాయీ బ్రాహ్మణ సంఘం గురువారం సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సంఘం మండల, పట్టణ అధ్యక్షులు ఎనగందుల శ్రీనివాస్‌, ఎల్‌.శంక ర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొడకండ్ల: నిత్యం జనం మధ్యలో ఉంటూ అభివృద్ధికి పాటుపడే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఓయూ జేఏసీ, బీఆర్‌ఎస్‌ యువజన, బీఆర్‌ఎస్‌వీ నాయకులు హరినాథ్‌, రవికుమార్‌, వెంకటేష్‌, సుధీర్‌, రామకృష్ణ తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు.

తొర్రూరు: ఎన్నారైల మద్దతు దయాకర్‌రావుకేనని బీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ అధ్యక్షుడు మహేష్‌ తన్నీరు తెలిపారు. సమావేశంలో ఎన్నారైలు జక్కిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పిన్న భాస్కర్‌, కిశోర్‌, లింగారెడ్డి, అభిషేక్‌, బిందులత, రమేష్‌ పాల్గొన్నారు.

ఆ పార్టీ వాగ్దానాలు నమ్మి మోసపోవద్దు

బీఆర్‌ఎస్‌ పాలకుర్తి అభ్యర్థి

ఎర్రబెల్లి దయాకర్‌రావు

మరిన్ని వార్తలు