కంటెస్టెంట్లకే షాక్‌: బిగ్‌బాస్‌ షో క్యాన్సిల్‌

10 May, 2021 21:20 IST|Sakshi

ఎంతో ఉత్కంఠతో కొనసాగుతున్న బిగ్‌బాస్‌ రియాల్టీ షోపై కరోనా పడగ విప్పింది. వాస్తవంగా గతేడాది ప్రారంభం కావాల్సిన కన్నడ బిగ్‌బాస్‌ షో క్యాన్సిల్‌ సీజన్‌-8 ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత విశేష ప్రేక్షకాదరణతో షో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైంది. దేశంలో అత్యధికంగా కరోనా వ్యాపిస్తున్న రాష్ట్రంగా కర్నాటక నిలిచింది. దీంతో ఆ కరోనా ప్రభావం బిగ్‌బాస్‌ షోపై కూడా పడింది.

వాటితోపాటు ఈ షోను హోస్ట్‌ చేస్తున్న కిచ్చా సుదీప్‌ అనారోగ్యం బారిన పడ్డాడు. కొన్నాళ్లు షోకు కూడా రాలేదు. అయినా కూడా షో విరామం లేకుండా కొనసాగింది. అయితే కరోనా కల్లోలం సృష్టిస్తుండడంతో కర్నాటకలో లాక్‌డౌన్‌ విధించారు. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో షో కొనసాగించడం కొంత ఇబ్బందికరంగా మారింది. కంటెస్టెంట్ల ఆరోగ్యం దృష్ట్యా వారిని ఇళ్లకు పంపించేసి ఈ షోను అర్ధాంతరంగా ప్రకటించారు.

 71 రోజుల పాటు షో కొనసాగింది. చివరకు 8 మంది కంటెస్టెంట్లు మిగిలి ఉన్నారు. వంద రోజుల షో 29 రోజులు మిగిలి ఉండగానే రద్దయ్యింది. ఈ నిర్ణయంతో ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్లు కూడా షాకయ్యారు. కలర్స్‌ ఆధ్వర్యంలో ఈ షో కొనసాగింది. ప్రశాంత్‌ సమ్‌ బర్గీ, అరవింద్‌ కేపీ మధ్య ట్రోఫీ పోరు కొనసాగుతోంది. వైష్ణవి, శమంత్‌, దివ్య సురేశ్‌ టాప్‌ 5 రేసులో ఉన్నారు. ట్రోఫీ లేకుండానే షో ముగిసింది. అయితే కొన్ని రోజులకు షో విజేతను ప్రకటిస్తారని తెలుస్తోంది. కాకపోతే వారికి బహుమతులు, ట్రోఫీ ప్రదానం పరిస్థితులు చక్కబడ్డ తర్వాత నిర్వహించనున్నట్లు సమాచారం. 

చదవండి: రేపు కేబినెట్‌ భేటీ: లాక్‌డౌన్‌పై తేల్చనున్న సీఎం కేసీఆర్‌

చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ 

మరిన్ని వార్తలు