Corona Virus: ఫోర్త్‌ వేవ్‌ టెన్షన్‌.. విమానాశ్రయాల్లో అలర్ట్‌

1 May, 2022 09:25 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కరోనా ఫోర్త్‌ వేవ్‌ భయాల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విమానాశ్రయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. జపాన్, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్‌ పరీక్ష తప్పనిసరి చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే విమానాశ్రయంలోనే ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలితే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపిస్తారు. ఆ్రస్టేలియా, వియత్నాం, న్యూజిలాండ్‌ నుంచి వచ్చే వారిపై కూడా నిఘా పెట్టారు.  

రాష్ట్రంలో 126 కరోనా కేసులు  
రాష్ట్రంలో శనివారం కొత్తగా 126 కరోనా పాజిటివ్‌ కేసులు తేలాయి. 76 మంది రోగులు కోలుకున్నారు. మరో ఇద్దరు మరణించారు. 1,785 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. బెంగళూరులో తాజాగా 120 కేసులు, 72 డిశ్చార్జిలు నమోదయ్యాయి. నగరంలో ప్రస్తుతం 1,715 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో 9,944 మందికి కరోనా పరీక్షలు చేశారు.  62,768 మందికి టీకాలను పంపిణీ చేశారు. చిక్కమగళూరులో రెండు, చిత్రదుర్గం, కలబురిగి, మైసూరు, ఉడుపిలో ఒక్కో కరోనా కేసు వచ్చాయి.  బెళగావిలో ఒకరు, విజయపురలో ఒకరు మృతి చెందారు. 

ఇది కూడా చదవండి: ‘చార్‌ధామ్‌’కు కోవిడ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి కాదు

మరిన్ని వార్తలు