Sakshi News home page

ప్రజల ఇంటికే ప్రమాణ పత్రాలు

Published Fri, Nov 10 2023 5:16 AM

- - Sakshi

కంప్లి: కూడ్లిగి పట్టణ పంచాయతీ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రజలు ఫారం–33 కోసం పడిగాపులు పడకుండా ఉండేందుకు పంచాయతీ యంత్రాంగం అర్జీలు అందించిన ప్రజల ఇళ్ల వాకిటికే ప్రమాణ పత్రాలు పంపిణీ చేస్తారు. సాంకేతికంగా బుధవారం కూడ్లిగి పట్టణ పంచాయతీలోని ఇళ్లకు సిబ్బంది నేరుగా వెళ్లి ప్రమాణ పత్రాలు అందిస్తారు.

గుర్తింపు కార్డులకు

అర్జీల ఆహ్వానం

కంప్లి: కుడితిని పట్టణ పంచాయతీలో దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన, రాష్ట్రీయ నగర జీవనోపాధి అభియాన్‌ యోజన ద్వారా స్వయం ఉపాధి పొందిన వీధి వ్యాపారస్తులకు గుర్తింపు కార్డుల పంపిణీకి అర్జీలను ఆహ్వానించారు. అర్జీలను ఈ నెల 27లోగా అందించాలని, వివరాలకు కుడితిని పట్టణ పంచాయతీ కార్యాలయంలో సంప్రందించాలని కార్యాలయ ముఖ్యాధికారి తెలిపారు.

క్షీణించిన తుంగభద్ర నీటి నిల్వ

కంప్లి: తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ రోజురోజుకు క్షీణిస్తూ బుధవారం సాయంత్రానికి 27.251 టీఎంసీలకు చేరింది. గతంలో బెంగళూరులో జరిగిన నీటిపారుదల సలహా సమితి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 10 వరకు మాత్రమే హెచ్‌ఎల్‌సీకి నీటిని సరఫరా చేయనున్నట్లు సమాచారం.

పశువులకు టీకాలు వేయండి

రాయచూరు రూరల్‌: జిల్లాలో పశువులకు వింత వ్యాధులు సోకుతున్నందున టీకాలు వేయడానికి అధికారులు చర్యలు చేపట్టాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్‌ చేసింది. గురువారం పశుసంవర్ధక శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి అధ్యక్షుడు లక్ష్మణగౌడ మాట్లాడారు. ప్రస్తుతం పశువులకు గాలికుంటు వ్యాధి సోకుతున్నందున రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి పశువులకు టీకాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

ఉపకార వేతనాల్లో

కోత తగదు

రాయచూరు రూరల్‌: జిల్లాలోని కట్టడ కార్మికుల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న శిష్య వేతనాల్లో కోతలు విధించడం తగదని టీయూసీఐ డిమాండ్‌ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అమరేష్‌ మాట్లాడారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం కలికా పథకంలో అందిస్తున్న శిష్య వేతనంలో కోత విధించారన్నారు. కోత విధించకుండా శిష్య వేతనాలు అందించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

దేశాన్ని చీల్చడానికి

బీజేపీ కుట్ర

బనశంకరి: బీజేపీ దేశం, సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తోందని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. గురువారం ప్యాలెస్‌ మైదానంలో కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సేవాదళ్‌ శతమానోత్సవ, రాష్ట్ర స్థాయి సమ్మేళనాన్ని సిద్దరామయ్య ప్రారంభించి మాట్లాడారు. బ్రిటిషువారిపై పోరాడటానికి సేవాదళ్‌ ఏర్పాటైంది సేవాదళ్‌ కార్యకర్తలు ఎవరు గాంధీ టోపీ ధరిస్తే వారిని సేవాదళ్‌గా గుర్తించారు. సేవాదళ్‌ కాంగ్రెస్‌ మూల స్తంభం కాగా మహాత్మగాంధీ నాయకత్వంలో బ్రిటిషువారిపై పోరాడి స్వాతంత్య్రం తీసుకువచ్చారని స్వాతంత్య్రపోరాటంలో అనేకమంది సేవాదళ్‌ కార్యకర్తలు ప్రాణాలు అర్పించారని, బీజేపీ నుంచి ఎటువంటి స్వాతంత్య్ర పోరాటం జరగలేదన్నారు. అయితే వారు దేశభక్తి పట్ల గంటల తరబడి మాట్లాడుతారని, నేడు దేశభక్తి ఉంది అంటే అది కాంగ్రెస్‌ కార్యకర్తల్లో మాత్రమే అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement