మంత్రిని కలిసిన రవాణా శాఖ అధికారులు

21 Mar, 2023 00:48 IST|Sakshi
మాట్లాడుతున్న రామ్మూర్తి నాయక్‌, పక్కన రాధాకిషోర్‌, ఎడవెల్లి కృష్ణ తదితరులు

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఆర్టీఓ కిషన్‌రావు, ఏఎంవీఐ వరప్రసాద్‌ సోమవారం ఖమ్మంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రవాణాశాఖ ద్వారా రూ.6,055 కోట్ల ఆదాయం సమకూరిందని, గతేడాదితో పోలిస్తే ఇది రూ.2,309 కోట్లు అదనమని తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా ఇంకా రూ.230 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని చెప్పారు. మంత్రి పువ్వాడ తీసుకున్న నిర్ణయాలు, శాఖలో చేసిన మార్పులతో ఆదాయం మెరుగైందని అధికారులు వివరించగా, మంత్రి వారిని అభినందించారు.

26న ‘హాథ్‌ సే హాథ్‌’ యాత్ర

వైరా: వైరాలో ఈనెల 26న నిర్వహించనున్న హాథ్‌ సే హాథ్‌ జోడోయాత్ర, సభను విజయ వంతం చేయాలని టీ పీసీసీ సభ్యుడు ధరావత్‌ రామ్మూర్తినాయక్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి యడవల్లి కృష్ణ పిలుపునిచ్చారు. వైరాలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ వైరాలోని అయ్యప్పస్వామి దేవాలయం నుండి తల్లాడ రోడ్డులోని సాయిబాబా దేవాలయం వరకు యాత్ర, అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావ్‌ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తదితరులు ఈ సభకు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు మానుకొండ రాధాకిషోర్‌, కట్ల రంగారావు, సూరంపల్లి రామారావు, పగడాల మంజుల, రామసహాయం మాధవరెడ్డి, దళ్‌సింగ్‌, శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, మంగీలాల్‌, సంతోష్‌, నాగరాజు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

డీసీసీబీ ఉద్యోగిపై దాడి కేసు ఉపసంహరణ

నేలకొండపల్లి: డీసీసీబీ ఉద్యోగిపై దాడి చేయడంతో పెట్టిన కేసును సోమవారం ఉపసంహరించుకున్నారు. మండలంలోని ముజ్జుగూడెంలో ఈనెల 17న నేలకొండపల్లి డీసీసీబీ ఉద్యోగులు రుణాల వసూళ్లకు వెళ్లిన క్రమంలో గ్రామానికి చెందిన బి.శ్రీను, డీసీసీబీ ఉద్యోగి నారాయణ మధ్య వివాదం జరగగా శ్రీను దాడిచేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశా రు. కాగా, డీసీసీబీ బ్రాంచ్‌కు సోమవారం వచ్చిన శ్రీను తన బకాయి రూ.16వేలు చెల్లించడంతో పాటు యాదృచ్ఛింగా ఘటన జరిగి నందున క్షమించాలని కోరాడు. దీంతో కేసు ఉపసంహరించుకున్నట్లుగా మేనేజర్‌ ఇందు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈకార్యక్ర మంలో అసిస్టెంట్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు