రూ.22 కోట్లు పెరిగిన బడ్జెట్‌!

28 Mar, 2023 01:42 IST|Sakshi

గత ఆర్థిక సంవత్సరం 2022–23లో రూ.367 కోట్లకుపైగా.. అంచనా బడ్జెట్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రభుత్వం నుంచి బ్లాక్‌ గ్రాంట్‌ రూపేణా రూ.188.22 కోట్లు యూజీసీ ఏరియర్స్‌ రూ 32.81 కోట్లు మరో రూ.183.60 కోట్లు అంతర్గత నిధుల నుంచి సమీకరిస్తారని అంచనా బడ్జెట్‌లో పేర్కొన్నారు. లోటు రూ.33 కోట్లు చూపెట్టారు. అయితే ఆర్థిక సంవత్సరంలో రూ.211 కోట్లకు పైగా వ్యయం అయినట్లుగా తెలుస్తోంది. కాగా.. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంటులో రూ.15.50 కోట్లు విడుదల చేయలేదని తెలుస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కూడా ప్లానింగ్‌, నాన్‌ప్లానింగ్‌ బడ్జెట్‌లో రూ.389 కోట్లకుపైగా అంచనా ప్రతిపాదించి ప్రవేశపెట్టి అందులో ఆదాయ వ్యయాలను కూడా అంచనా వేశాక సుమారు రూ.15 కోట్లకు పైగానే లోటు బడ్జెట్‌ ఉండబోతోందని తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.22 కోట్లకుపైగా ఈఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్‌ పెంచినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి ఇచ్చే నిధులకంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి పనులకు గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.

మరిన్ని వార్తలు