నామినేషన్ల పరిశీలన పూర్తి | Sakshi
Sakshi News home page

నామినేషన్ల పరిశీలన పూర్తి

Published Tue, Nov 14 2023 1:18 AM

మరిపెడ: నామినేషన్లను పరిశీలిస్తున్న 
ఎన్నికల అధికారులు - Sakshi

మహబూబాబాద్‌: జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మానుకోట నియోజకవర్గంలో ఈ నెల 3నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీరించగా.. 22 మంది అభ్యర్థులు 40సెట్లు దాఖలు చేశారు. కాగా ఆర్డీఓ కార్యాలయంలోని సోమవారం స్క్రూట్నీ నిర్వహించారు. ఏడు నామినేషన్లు పలు కారణాల వల్ల తిరస్కరణకు గురైనట్లు ఆర్వో అలివేలు తెలిపారు.

మిగిలింది వీరే..

గుగులోత్‌ శేఖర్‌–బీఎస్పీ, డాక్టర్‌ భూక్య మురళీనా యక్‌–కాంగ్రెస్‌, బానోత్‌ శంకర్‌నాయక్‌–బీఆర్‌ఎస్‌, జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌–బీజేపీ, జాటోత్‌ చక్రావతి–ధర్మసమాజ్‌ పార్టీ, జాటోత్‌ బిచ్యా–ఎంసీపీఐ, పోనక రాందాస్‌–రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, వట్టం ఉపేందర్‌– బహుజన ముక్తి పార్టీ, బట్టు బిన్నమ్మ–స్వతంత్ర, భూక్య బాలునాయక్‌–స్వతంత్ర, మంగిలాల్‌–స్వతంత్ర, నూనావత్‌ రమేష్‌–స్వతంత్ర, నూనావత్‌ రాధ–స్వతంత్ర, గుగులోత్‌ వెంకన్న–స్వతంత్ర, దారావత్‌ వెంకన్న–స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలవనున్నారు.

డోర్నకల్‌లో రెండు నామినేషన్ల తిరస్కరణ..

మరిపెడ: డోర్నకల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 19 నామినేషన్లు దాఖలు కాగా సోమవారం నిర్వహించి న స్క్రూట్నీలో ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఆర్వో నర్సింహారావు వెల్లడించారు. ఇందులో నానవత్‌ భూపాల్‌నాయక్‌ రెండు నామినేషన్‌ సెట్లు దాఖలు చేయగా ఏ,బీ ఫామ్స్‌ అందజేయకపోవడంతో మొదటి సెట్‌, సకాలంలో అఫిడవిట్‌ అందజేయకపోవడంతో రెండోసెట్‌ తిరస్కరణకు గురైనట్లు వె ల్లడించారు. అలాగే ఏ,బీ ఫామ్స్‌ అందజేయకపోవడంతో పోరిక ప్రమీల నామినేషన్‌ను తిరస్కరించిన ట్లు ఆర్వో నర్సంహారావు తెలిపారు.కాగా17మంది అభ్యర్థులు పోటీకి అర్హులైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.కార్యక్రమంలో ఎన్నికల సహాయ అధి కారి, తహసీల్దార్‌ సైదులు, సిబ్బంది పాల్గొన్నారు.

మానుకోటలో ఏడు తిరస్కరణ

15 మంది అభ్యర్థులతో జాబితా విడుదల

Advertisement
Advertisement